వీడిన వాణీ జయరామ్ మరణ మిస్టరీ కేస్.. మరణానికి కారణాలు ఇవే..!

-

వాణీ జయరామ్.. ప్రముఖ గాయనిగా సుమారుగా భాషతో సంబంధం లేకుండా పదివేలకు పైగా పాటలు పాడి రికార్డు సృష్టించిన వాణీ జయరాం గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇటీవలే ఆమె సేవలు గుర్తించిన కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డుతో రిపబ్లిక్ డే సందర్భంగా సత్కరించిన విషయం తెలిసిందే. దీంతో ఈమె పేరు భారీగా మారుమ్రోగింది. దీంతో అందరూ ఆమెకు శుభాకాంక్షలు తెలియజేశారు. కానీ ఉన్నట్టుండి శనివారం రోజున ఆమె అనుమానాధాస్పద స్థితిలో రక్తం మడుగులలో పడి ఉండడం చూసి ఒక్కసారిగా భయభ్రాంతులకు గురి అయ్యారు అభిమానులు.

చెన్నైలోని తన నివాసంలో విగత జీవిగా పడి ఉండడం చూసి పనిమనిషి.. ఆమె కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారం ఇవ్వగా అక్కడికి చేరుకున్న పోలీసులు మరణానికి గల కారణాలను తెలుసుకోవడానికి దర్యాప్తు చేపట్టారు. అంతేకాదు అపార్ట్మెంట్లో ఉన్న సీసీ కెమెరాలు కూడా పరిశీలించారు. పోస్ట్మార్టం అనంతరం ఆమె తలకు ఒకటిన్నర ఇంచులోతు గాయం అయిందని ముఖంపై కూడా గాయాలు తగిలాయి అని స్పష్టం చేశారు. దీంతో అనుమానాలకు మరింత తెరలేపాయి. ఆమెను ఎవరైనా కొట్టి చంపారా అనే అనుమానాలు కూడా అభిమానులలోనే కాదు సినీ ఇండస్ట్రీలో ఉండే ప్రముఖులలో కూడా కలిగాయి.

కానీ తాజాగా ఫోరెన్సిక్ రిపోర్టు ప్రకారం సీసీటీవీలను కూడా పరిశీలించిన తర్వాత అనుమానాధస్పదంగా ఆమె మరణం జరగలేదు అని బెడ్రూంలో కాలుజారి కింద పడడం వల్లే తలకు గాయం తగిలింది అని అందువల్లే ఆమె మరణించింది అని ఫోరెన్సిక్ రిపోర్టు స్పష్టం చేసింది. 72 సంవత్సరాల వయసు లో ఆమె మరణించడం నిజంగా తీరని దుఃఖమని చెప్పవచ్చు. ఏది ఏమైనా వాణీ జయరామ్ మృతికి సినీ ఇండస్ట్రీ పూర్తిగా సంతాపం వ్యక్తం చేస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news