వెంకటేష్ కూతురు ప్రేమ వివాహం

-

విక్టరీ వెంకటేష్ ఇంట పెళ్లి బాజాలు మోగనున్నాయా అంటే అవుననే అంటున్నాయి ఫిల్మ్ నగర్ వర్గాలు. విక్టరీ వెంకటేష్ పెద్ద కూతురు అశ్రిత పెళ్లి ఏర్పాట్లు జరుగుతున్నాయట. ఇక్కడ విశేషం ఏంటంటే తన కూతురు ప్రేమించిన అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తున్నాడట వెంకటేష్. హైదరాబాద్ రేసు క్లబ్ చైర్మన్ ఆర్. సురేందర్ రెడ్డి మనవడితో వెంకటేష్ కూతురు పెళ్లి ఫిక్స్ అయ్యిందట.

ఇరువురి మధ్య స్నేహం ప్రేమగా మారగా ఆ విషయాన్ని ఇంట్లో పెద్దలకు చెప్పి వారి అంగీకారాన్ని సంపాదించారు. సురేష్ బాబుతో కలిసి వెంకటేష్ అబ్బాయి వాళ్ల ఇంటికి వెళ్లి పెళ్లి గురించి అంతా చర్చించుకున్నరట. త్వరలోనే ఈ న్యూస్ అఫిషియల్ గా ఎనౌన్స్ చేస్తారని తెలుస్తుంది. ప్రస్తుతం వెంకటేష్ ఎఫ్-2 సినిమా చేస్తున్నాడు. అనీల్ రావిపుడి డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో వరుణ్ తేజ్ కూడా నటిస్తున్నాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version