Ori Devuda : దేవుడి పాత్రలో విక్టరీ వెంకటేశ్ వచ్చేస్తున్నాడహో..

-

వరుస చిత్రాలతో టాలీవుడ్ లో దూసుకెళ్తున్నాడ మాస్ కా దస్ హీరో విశ్వక్ సేన్. ఆయన తన లేటెస్ట్ సినిమా ఓరి దేవుడా షూటింగ్ సూపర్ ఫాస్ట్ గా జరుగుతోంది. మిథిలా పాల్కర్‌ హీరోయిన్ గా అశ్వత్‌ మారి ముత్తు తెరకెక్కించిన చిత్రం ‘ఓరి దేవుడా’ సినిమాను ప్రసాద్‌ వి.పొట్లూరి నిర్మించారు.

ఈ సినిమాలో హీరో వెంకటేశ్ దేవుడి పాత్రలో కనిపించనున్నట్లు ఇప్పటికే వార్తలొచ్చాయి. ఈ విషయాన్ని చిత్ర బృందం ఓ వీడియో గ్లింప్స్‌ ద్వారా అధికారికంగా ధ్రువీకరించింది. ఆ ప్రచార చిత్రంలో వెంకటేష్‌ కనిపించిన విధానాన్ని బట్టి.. ఆయనిందులో స్టైలిష్‌ లుక్‌లో కనపడే దేవుడి పాత్ర పోషించినట్లు అర్థమవుతోంది.

‘‘ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. నిర్మాణాంతర పనులు శరవేగంగా జరుగుతున్నాయి. దీపావళి సందర్భంగా అక్టోబర్‌ 21న సినిమా విడుదల చేయనున్నాం’’ అని చిత్ర వర్గాలు తెలిపాయి. ఈ సినిమాకి సంగీతం: లియోన్‌ జేమ్స్‌, మాటలు: తరుణ్‌ భాస్కర్‌, కూర్పు: విజయ్‌, ఛాయాగ్రహణం: విదు అయ్యన్న.

Read more RELATED
Recommended to you

Latest news