జంగ్లీ ట్రైలర్ రిలీజ్.. పవర్ ప్యాక్డ్ మూవీ..!

-

విద్యుత్ జమాల్ హీరోగా పూజా సావంత్ ఫీమేల్ లీడ్ గా వస్తున్న సినిమా జంగ్లీ. హాలీవుడ్ డైరక్టర్ చక్ రసెల్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ట్రైలర్ కొద్ది గంటల క్రితం రిలీజైంది. జంగ్లీ పిక్చర్స్ బ్యానర్ లో వినీత్ జైన్ ఈ సినిమా నిర్మిస్తున్నారు. భోళా అనే ఏనుగుతో చిన్నప్పటి నుండి స్నేహం చేసిన హీరో దానితో కలిసి పెరిగి పెద్దవాడవుతాడు.

ఏనుగుల గ్రూప్ కు కెప్టెన్ గా వ్యవహరిస్తున్న భోళా హీరో ఎంతో స్నేహంగా ఉంటారు. అయితే వేటగాళ్లు వచ్చి భోళాని చంపి దాని దంతాలను తీసుకెళ్లాలని చూస్తారు. అయితే వారిని మన హీరో ఎలా ఎదుర్కున్నాడు అన్నది సినిమా కథ. జంగ్లీ ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా ఉంది. ట్రైలర్ లో ఎన్నో అడ్వెంచర్స్ కనబడుతున్నాయి.

ముఖ్యంగా విద్యుత్ జమాల్ యాక్షన్ మాస్ ఆడియెన్స్ కు మంచి ఎంటర్టైనింగ్ ఇచ్చేలా ఉంది. మంచి కథ.. రొమాన్స్.. యాక్షన్.. ఇలా పవర్ ప్యాక్డ్ మూవీగా వస్తున్న జంగ్లీ ట్రైలర్ మెప్పించగా సినిమా ఎలా ఉంటుందో చూడాలి. ఏప్రిల్ 5న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news