రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరల్డ్ ఫేమస్ హీరోతో పాటు ఆనంద్ అన్నామలై దర్శకత్వంలో మరొక సినిమా, కలిపి మొత్తం రెండు సినిమాల్లో హీరోగా నటిస్తున్నాడు. కాగా గీతా గోవిందం తరువాత సరైన సక్సెస్ లేని విజయ్, ఈ రెండు సినిమాల అనంతరం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో చేయబోయే సినిమా విషయమై భారీ ప్లానింగ్ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. పూరి జగన్నాథ్ మరియు నటి ఛార్మి కలిసి సంయుక్తంగా ఎంతో భారీగా నిర్మించబోయే ఈ సినిమా ద్వారా పూరి, విజయ్ ని పాన్ ఇండియా హీరోగా చూపించబోతున్నట్లు టాక్.
ఇక ఈ సినిమా కథను ఇటీవల తన ఫేవరెట్ స్పాట్ అయిన బ్యాంకాక్ వెళ్లి రాసుకుని వచ్చిన పూరి, ఆ కథను మంచి యాక్షన్ ఎంటర్టైనర్ గా తీర్చిదిద్దినట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీ, తమిళ్, మలయాళ భాషల్లో కూడా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. అలానే కథను అన్ని భాషల ప్రేక్షకులకు రీచ్ అయ్యే విధంగా కూడా పూరి రాసుకున్నారట. ఇప్పటికే బాలీవుడ్ లో విజయ్ కు కొంత క్రేజ్ ఏర్పడడంతో, ఆ క్రేజ్ ని వినియోగించుకుని అతడిని పాన్ ఇండియా హీరోగా నిలబెట్టేందుకు ట్రై చేస్తున్నాడట. ఒక స్టార్ హీరోయిన్ ఈ సినిమాలో నటించబోతోందని, అలానే ఈ సినిమాలోని ఇతర నటీనటులు మరియు సాంకేతిక నిపుణుల ఎంపిక కూడా దాదాపుగా పూర్తి అయిందని సమాచారం.
కాగా వీలైనంత త్వరగా అన్ని కార్యక్రమాలు సిద్ధం చేసి సినిమాను రాబోయే సంక్రాంతి సమయంలో ప్రారంభించేలా చూస్తున్నారట. అసలు నిజానికి పూరి ఎప్పటినుండో ఒక మంచి పాన్ ఇండియా మూవీని తీయాలని చూస్తున్నారని, అయితే కొన్నేళ్లుగా ఆయనకు సరైన సక్సెస్ లేకపోవడంతో ఆ విషయాన్నీ ప్రక్కన పెట్టారని అంటున్నారు. ఇక ఇటీవల రామ్ తో తీసిన ఇస్మార్ట్ శంకర్ సూపర్ హిట్ తో మళ్ళి లైమ్ లైట్ లోకి వచ్చిన పూరి, ఈసారి విజయ్ ను మంచి పవర్ఫుల్ రోల్ లో పాన్ ఇండియా హీరోగా చూపించబోతున్నట్లు తెలుస్తోంది. కాగా ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్త పై అధికారిక ప్రకటన మాత్రం రావలసి ఉంది…….!!