‘జన గణ మన’ గురించి మర్చిపోవాలా..? విజయ్ దేవరకొండ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. !!

-

డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటించిన ‘లైగర్’ ఇటీవల పాన్ ఇండియా వైడ్ గా రిలీజైంది. అయితే, ఈ పిక్చర్ బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టింది. భారీ అంచనాల నడుము విడుదలైన ఈ మూవీ.. ఆడియన్స్ ను ఆకట్టుకోలేకపోయింది.

ఈ క్రమంలోనే పూరీ-విజయ్ కాంబోలో వచ్చే నెక్ట్స్ ఫిల్మ్ ‘జన గణ మన’ పైన రకరకాల వార్తలు సోషల్ మీడియాలో వస్తున్నాయి. ఇంతకీ ఈ ప్రాజెక్ట్ ఉంటుందా? ఉందదా? అనే చర్చ జరుగుతున్నది. ఈ ప్రాజెక్టును ప్రొడ్యూస్ చేస్తున్న పూరీ కనెక్ట్స్ సంస్థ నుంచి ఎలాంటి ప్రకటన అయితే రాలేదు.

తాజాగా సైమా వేడుకకు విజయ్ దేవరకొండ హాజరయ్యారు. అక్కడ మీడియా ‘జన గణ మన’ను గురించి ప్రశ్నించగా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ప్రతీ ఒక్కరు సైమాకు వేడుకను ఎంజాయ్ చేయడానికి వచ్చారని , కాబట్టి ఈ సమయంలో దానిని మర్చిపోవాలని, సైమాను ఎంజాయ్ చేయాలని విజయ్ అన్నాడట. విజయ్ దేవరకొండ కామెంట్స్ తో ‘జన గణ మన’ ఆగిపోయిందనే అర్థం చేసుకోవాలని పలువురు నెటిజన్లు అంటున్నారు.

పూరీ జగన్నాథ్ డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ‘జన గణ మన’ను సూపర్ స్టార్ మహేశ్ బాబుతో తీయలాని గతంలో పూరీ అనుకున్నారు. కానీ, ఆ తర్వాత విజయ్ దేవరకొండతో తీస్తున్నట్లు ప్రకటించారు. పూజ కార్యక్రమాలు కూడా ముంబైలో ఘనంగా జరిగాయి. ఇందులో హీరోయిన్ గా బుట్ట బొమ్మ పూజా హెగ్డేను ఫైనల్ చేశారు. చూడాలి మరి భవిష్యత్తులో ‘జన గణ మన’ గురించి ఎలాంటి ప్రకటన వస్తుందో..

Read more RELATED
Recommended to you

Latest news