నోటా రివ్యూ & రేటింగ్

-

Vijay Devarakonda Nota Movie Review

వరుస విజయాలతో దూసుకుపోతున్న క్రేజీ హీరో విజయ్ దేవరకొండ తమిళ దర్శకుడు ఆనంద్ రంగ డైరక్షన్ లో వచ్చిన సినిమా నోటా. టైటిల్ దగ్గర నుండి సంచలనంగా మారిన ఈ సినిమా రిలీజ్ వరకు మంచి ప్రీ రిలీజ్ బజ్ ఏర్పరచుకుంది. తెలుగు, తమిళ భాషల్లో రిలీజైన ఈ సినిమా ఎలా ఉందో ఈనాటి సమీక్షలో చూద్దాం.

కథ :

సిఎం వాసుదేవ్ (నాజర్) మీద ప్రతిపక్షాలు కేసు వేయడంతో అతను తన ప్లేస్ లో తన కొడుకు వరుణ్ (విజయ్ దేవరకొండ)ను సిఎంగా నియమిస్తాడు. సిఎం వరుణ్ మొదట సిఎం అధికారాన్ని కామెడీగా తీసుకున్నా ఓ చిన్న సంఘటన వల్ల అతనిలో మార్పు వస్తుంది. ఇక తండ్రి నీచ రాజకీయాల గురించి తెలుసుకున్న వరుణ్ అతనో ధ్రువ తారగా ప్రజలు శ్రేయస్సు కోరే సిఎంగా మారాలని అనుకుంటాడు. ఈ టైంలో అతనేం చేశాడు..? తండ్రి దాచిపెట్టిన పెద్ద మొత్తాన్ని ఎలా కనిపెట్టాడు..? అన్నది సినిమా కథ.

ఎలా ఉందంటే :

హీరో సిఎం అనగానే రానా లీడర్, మహేష్ భరత్ అనే నేను సినిమాలు ఆలోచనల్లోకి వస్తాయి. అయితే మూడు కథల్లో హీరో సడెన్ గా వచ్చి సిఎం అయిపోతాడు. అదొక్కటే కామన్ పాయింట్. అయితే లీడర్ చెప్పాలనుకున్న కథ వేరే.. అందులో అతను సక్సెస్ అయ్యాడు. ఇక భరత్ అనే నేను విషయంలో కూడా కొరటాల శివ మంచి పాయింట్ కమర్షియల్ పంథాలో మహేష్ ఇమేజ్ ను సాటిస్ఫై చేశాడు.

విజయ్ నోటా విషయానికొస్తే.. మొదలు ఎక్కడో మొదలు పెట్టి ఎక్కడో ఎండ్ చేసినట్టు అవుతుంది. అనుకోకుండా సిఎం అవడం.. ముందు లైట్ తీసుకున్న హీరో ఆ తర్వాత సీరియస్ గా తన ఆపరేషన్స్ మొదలు పెట్టడం. ఇంతలో తండ్రికి యాక్సిడెంట్.. ఇంటెలిజెన్స్ రిపోర్ట్.. 10వేల స్కాం ఇలా అంతా గందరగోళంగా అవుతుంది. మొదటి భాగం అంతా వేగంగా నడిపించిన దర్శకుడు సెకండ్ హాఫ్ గజిబీజి చేశాడు. ముఖ్యంగా తమిళనాడు రాజకీయాలను ప్రతిబింభించేలా సినిమా ఉంటుంది.

సినిమా సెకండ్ హాఫ్ ఫ్లడ్స్ సీన్ బాగానే వచ్చింది. అలాంటి మరో రెండు సీన్స్ ఉంటే బాగుండేది అనిపిస్తుంది. ఇక విజయ్ ను కూడా సరిగా వాడుకోలేదు. మెహ్రీన్ కౌర్ అసలు ఎందుకు చేసిందో తెలియదు.

ఎలా చేశారు :

విజయ్ ముందు మూడు సినిమాల పాత్రలకు పూర్తి విరుద్ధంగా ఈ క్యారక్టర్ ఉంటుంది. తనవరకు తాను బాగానే చేశాడు విజయ్. అయితే దర్శకుడు అతన్ని ఇంకా బాగా వాడుకోవాల్సి ఉంది. సెకండ్ హాఫ్.. క్లైమాక్స్ హీరో క్యారక్టరైజేషన్ వీక్ అనిపిస్తుంది. సినిమాలో మెహ్రీ కౌర్ ఎందుకు ఉందో ఎవరికి అర్ధం కాదు. ఆమెది కేమియో రోల్ అనుకోవచ్చు. నాజర్, సత్యరాజ్ పాత్రలు ఆకట్టుకున్నాయి. ప్రతిపక్షంలో మహిళా నేతగా చేసిన ఆమె కూడా బాగా చేసింది. ప్రియదర్శి ఉన్న రెండు మూడు సీన్స్ ఆకట్టుకున్నాడు.

శాం సిఎస్ మ్యూజిక్ మెప్పించలేదు. బిజిఎం ఓకే. సంతాన కృష్ణన్ సినిమాటోగ్రఫీ బాగుంది. కథ, కథనాల్లో దర్శకుడు ఏమాత్రం ఆకట్టుకోలేదు. ఎంచుకున్న కథ.. తీసుకెళ్లిన కథనం కుదరలేదనిపిస్తుంది. స్టూడియో గ్రీన్ ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

ప్లస్ పాయింట్స్ :

విజయ్ నటన

సినిమాటోగ్రఫీ

మైనస్ పాయింట్స్ :

ఎంటర్టైన్మెంట్ మిస్సింగ్

స్టోరీ

స్క్రీన్ ప్లే

బాటం లైన్ :

నోటాకి ఓటు వేయని ఆడియెన్స్..!

రేటింగ్ : 2/5

Read more RELATED
Recommended to you

Latest news