లేడీ సూపర్ స్టార్ తో రౌడీ స్టార్..!

6

సౌత్ లో క్రేజీ హీరోయిన్ గా స్టార్ హీరోలకు ధీటుగా పాపులారిటీ సంపాదించిన నయనతార తమిళంలో ప్రయోగాత్మక సినిమాలు చేస్తూ సక్సెస్ అందుకుంటుంది. ఓ పక్క కమర్షియల్ సినిమాలకు ఆమె ఓకే చెబుతుంది. తెలుగులో సీనియర్ స్టార్స్ కు పర్ఫెక్ట్ జోడీ అయిన నయనతార తమిళంలో యువ హీరోల సరసన నటించేస్తుంది. ఇక లేటెస్ట్ గా రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటిస్తుందని తెలుస్తుంది.

తమిళంలో విజయ్ నటించిన సినిమా నోటా పెద్దగా ఆడలేదు. అయినా సరే మరో బైలింగ్వల్ మూవీకి ప్లాన్ చేస్తున్నాడు విజయ్ దేవరకొండ. ఈమధ్యనే నూతన దర్శకుడు చెప్పిన కథకు ఓకే చెప్పాడని తెలుస్తుంది. ఈ సినిమాను ఎస్.ఆర్.ప్రభు నిర్మిస్తారని తెలుస్తుంది. విజయ్, నయనతార అసలు ఊహలకే అందని ఈ కాంబినేషన్ ఎలా ఉంటుందో చూడాలి. నయనతార ఓకే చెప్పింది అంటే సినిమాలో మ్యాటర్ ఉన్నట్టే. మరి విజయ్ తో నయనతార కలిసి ఎలాంటి మ్యాజిక్ చేస్తారో చూడాలి.

amazon ad