చంద్రబాబుకు మరో షాక్.. వైసీపీలో చేరనున్న గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మోదుగుల

-

ఏపీలో అధికార పార్టీ టీడీపీకి విపరీతంగా దెబ్బలు తాకుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్నా కొద్దీ టీడీపీ నుంచి చాలా మంది నేతలు వెళ్లిపోతున్నారు. టీడీపీకి రాజీనామా చేసి చాలామంది వైసీపీలో చేరుతున్నారు. ఇప్పటికే టీడీపీకి చెందిన ముఖ్య నేతలు టీడీపీని వీడి వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే.

Guntur west mla modugula to join in ysrcp?

తాజాగా గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి కూడా వైసీపీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారట. త్వరలోనే ఆయన టీడీపీకి రాజీనామా చేయనున్నారట. గత కంత కాలంగా మోదుగుల పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. నిన్న చంద్రబాబు నిర్వహించిన సమీక్షకు కూడా హాజరు కాలేదు మోదుగుల. దీంతో మోదుగుల వైసీపీ చేరిక ఖాయం అయిపోయినట్టే అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

గుంటూరు లోక్ సభ పరిధిలో ఉన్న ఏడు అసెంబ్లీ స్థానాల్లో సీట్లు ఎవరికి ఇవ్వాలన్న విషయంపై జరిగిన సమీక్షకు మోదుగుల హాజరు కాకపోవడం… ఈ సమావేశానికి వచ్చిన గుంటూరు ఎంపీ గల్లా సైతం మోదుగుల ప్రవర్తన పార్టీకి నష్టం చేకూరుస్తుందని చెప్పడంతో వచ్చే ఎన్నికల్లో టీడీపీ నుంచి మోదుగులకు టికెట్ డౌటే అని తెలుస్తోంది. వైసీపీ నుంచి మోదుగులకు టికెట్ కన్ఫమ్ అయితే ఆయన వైసీపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నట్టు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news