స్టార్ హీరోల‌ను మించిపోతున్న విజ‌య్ దేవ‌రకొండ‌.. ఏ విష‌యంలో అంటే?

ఇప్పుడు టాలీవుడ్‌లో స్టార్ హీరోలు అన‌గానే అంద‌రికీ ప‌వ‌న్ క‌ల్యాణ్‌, మ‌హేశ్ బాబు, ఎన్టీఆర్‌, అల్లు అర్జున్‌, ప్ర‌భాస్‌, రామ్ చ‌ర‌ణ్ వీళ్లు గుర్తుకొస్తారు. ఇక ఫ్యాన్ ఫాలోయింగ్‌లో కూడా వీరిదే సెప‌రేటు బేస్‌. మ‌రి సోష‌ల్ మీడియాలో ఈ లెక్క‌న వీరికే ఎక్కువ ఫ్యాన్ ఫాలోయంగ్ ఉండాలి క‌దా. కానీ వీరికంటే కూడా చాలా ఎక్కువ మంది ఫాలోవ‌ర్స్ ఓ హీరోకు ఉన్నారు.

విజ‌య్ దేవ‌ర‌కొండ చాలా త‌క్కువ టైమ్‌లో యూత్‌లో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. స్టార్ హీరోలంద‌రికంటే ఇన్ స్టా గ్రామ్‌లో విజ‌య్‌కు ఎక్కువ మంది ఫాలోవ‌ర్స్ ఉన్నారు. దాదాపు 12మిలియ‌న్ల ఫాలోవ‌ర్స్ ఉన్నారు.

ఈయ‌న త‌ర్వాత అల్లు అర్జున్‌కు 12 మిలియన్ రీసెంట్‌గా ఫాలోవ‌ర్స్ అయ్యారు. విజ‌య్ త‌ర్వాత ఈ ఫీట్ అందుకున్న రెండో హీరో అర్జున్‌. ఇక మూడో స్థానంలో 6.8మిలియన్ మంది ఫాలోవర్స్‌తో మ‌హేశ్ బాబు ఉన్నారు. ఇక 6.5 మిలియన్ ఫాలోవర్స్‌తో రెబల్ స్టార్ ప్రభాస్ టాప్ 4లో నిలిచారు, ఐదో స్థానంలో ఉన్న రానాకు 4.4 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. ఇక 3.9 మిలియన్ ఫాలోవర్స్‌తో ఆరో స్థానంలో రామ్ చరణ్ నిలిచాడు. ఇత‌ని త‌ర్వాత వ‌రుణ్ తేజ్‌, ఎన్టీఆర్ లు ఉన్నారు.