బ్రేకింగ్: ఓటు నోటు కేసులో రేవంత్ రెడ్డికి బిగ్ షాక్

ఓటుకి నోటు వ్యవహారం దాదాపు ఆరేళ్ళ క్రితం రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం అయిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం తర్వాత ప్రస్తుత కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి, ఏపీ మాజీ సిఎం చంద్రబాబు నాయుడు బాగా ఇబ్బంది పడ్డారు. మండలి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ చేసే విధంగా నామినేటెడ్ ఎమ్మెల్యే స్టిఫెన్ సన్ కి 50 లక్షలు ఇస్తూ రేవంత్ రెడ్డి రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు.

revanth-reddy

ఇక అక్కడి నుంచి ఈ కేసుని ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. అయితే ఈ కేసుకి సంబదించి ఇప్పుడు కీలక పరిణామం చోటు చేసుకుంది. 50 లక్షల వ్యవహారానికి సంబంధించి ఈడీ రేవంత్ రెడ్డి పై చార్జ్ షీట్ దాఖలు చేసింది. రేవంత్ రెడ్డిపై మనీ లాండరింగ్ కేసు కూడా నమోదు చేసారు. దీనితో ఈ వ్యవహారం ఏ మలుపు తిరుగుతుందో అని ఆసక్తిని రేపుతుంది.