విజయ్ సర్కార్ ఫస్ట్ టాక్.. తేడా కొడుతుందే..!

-

కోలీవుడ్ స్టార్ హీరో రజినికాంత్ తర్వాత ఆ రేంజ్ ఫాలోయింగ్ ఉన్న హీరో విజయ్ సినిమా రిలీజ్ అంటే ఫ్యాన్స్ హడావిడి అంతా ఇంతా కాదు. విజయ్, మురుగదాస్ కాంబినేషన్ లో వస్తున్న సర్కార్ సినిమా ఈరోజు రిలీజ్ అవుతుంది. కొన్ని చోట్ల ఆల్రెడీ ప్రీమియర్స్ పడ్డాయి. పొలిటికల్ థ్రిల్లర్ గా రాబోతున్న ఈ సినిమా ఫస్ట్ టాక్ పెద్దగా బాగాలేదని చెప్పొచ్చు.

ఫారిన్ నుండి వచ్చిన హీరో తన ఓటు హక్కు వినియోగించుకోవాలని చూస్తాడు. కాని అప్పటికే తన స్థానంలో ఎవరో ఓటు వేస్తారు. ఇక అప్పుడు హీరో ఏం చేశాడు అన్నది సినిమా కథ. మురుగదాస్ సర్కార్ ను రొటీన్ స్టోరీ, స్క్రీన్ ప్లేతో నడిపించాడని అంటున్నారు. విజయ్ ఇమేజ్ కు తగిన కథ కాదని.. సినిమాలో విజయ్ కూడా అంత ఎనర్జిటిక్ గా కనిపించలేదని అంటున్నారు.

ఇక విజయ్ సర్కార్ ను కొన్నిచోట్ల మహేష్ స్పైడర్ తో పోల్చుతున్నారు. సూపర్ స్టార్ మహేష్, మురుగదాస్ కాంబినేషన్ లో వచ్చిన స్పైడర్ లాస్ట్ ఇయర్ రిలీజై డిజాస్టర్ అయ్యింది. ఆ సినిమాలానే విజయ్ సర్కార్ కూడా ఏమాత్రం అంచనాలను అందుకోలేదని టాక్. మరి అసలు టాక్ ఏంటన్నది సాయంత్రం వరకు తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news