సంక్రాంతి అల్లుడిగా వచ్చేస్తున్న విజయ్..నయా పోస్టర్ అదుర్స్

కోలీవుడ్ స్టార్ హీరో ఇళయ తలపతి విజయ్..ఈ సారి సంక్రాంతి అల్లుడిగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. వచ్చే ఏడాది జనవరిలో సంక్రాంతి కానుకగా ఆయన నటిస్తున్న 66వ చిత్రం ‘వారసి(తెలుగులో..వారసుడు)’ విడుదల కానున్నది. జూన్ 22(బుధవారం) విజయ్ బర్త్ డే సందర్భంగా మేకర్స్ నయా పోస్టర్ విడుదల చేశారు.

సదరు పోస్టర్ లో విజయ్ లుక్ అదిరిపోయింది. సంక్రాంతి బుల్లోడిలాగా..అలా అల్ట్రా స్టైలిష్ లుక్ లో విజయ్..చాలా బాగున్నాడు. చిన్న పిల్లలు, గాలి పటాలు, చెరుకు గడలు, బంతిపూల మధ్యలో..అలా పడుకుని చక్కటి లుక్ ఇచ్చాడు ఇళయ తలపతి.

ఫస్ట్ రిలీజ్ చేసిన పోస్టర్ లో క్లాసీ లుక్ లో కనబడిన విజయ్.. తాజాగా విడుదల చేసిన నయా పోస్టర్ లో డిఫరెంట్ గా కనబడుతున్నాడు. మొత్తంగా ‘మహర్షి’ ఫేమ్ వంశీ పైడి పల్లి వెరీ డిఫరెంట్ అవతార్స్ లో విజయ్ ను చూపించబోతున్నారని స్పష్టమవుతోంది. థమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ చిత్రాన్ని టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో హీరోయిన్ రష్మిక మందన నటిస్తుండగా, శ్రీకాంత్, సంగీత, ప్రకాశ్ రాజ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.