సెలవిక సూపర్ స్టార్ కృష్ణ గారు – విజయశాంతి ఎమోషనల్‌

-

సెలవిక సూపర్ స్టార్ కృష్ణ గారు అంటూ విజయశాంతి ఎమోషనల్‌ అయ్యారు. “ఈ అమ్మాయి మరీ చిన్న బిడ్డలా… నాకు కూతురిలాగా ఉంటది నిర్మలా…” అని, మీరు విజయనిర్మల గారితో అంటే… “నాకు తెలుసు, తను పెద్ద హీరోయిన్ అవుతుంది” అని 1980లో ఆంటీ అన్న మాట… నా తొలి చిత్రం కిలాడీ కృష్ణుడు సమయంలో ఒక చక్కటి జ్ఞాపకం అంటూ సూపర్‌ స్టార్‌ కృష్ణను గుర్తు చేసుకున్నారు విజయశాంతి.

సూపర్ స్టార్ అయిన మీతో ఆ తర్వాత ఎన్నో హిట్స్, సూపర్‌హిట్స్ అని తెలిపారు.
ఆ “కిలాడీ కృష్ణుడు” నుండి “ఒసే రాములమ్మ” వరకూ ఎన్నో సినిమాలలో కళాకారులుగా కలసి పనిచెయ్యగలిగామని ట్వీట్‌ చేశారు విజయశాంతి. ఇప్పుడిక వెళ్లిపోయిన ఆంటీతో పాటు మీరు కూడా… అపురూపమైన జ్ఞాపకం… సెలవిక సూపర్ స్టార్ కృష్ణ గారు అంటూ కృష్ణతో ఉన్న ఫోటోలను షేర్‌ చేశారు విజయశాంతి.

Read more RELATED
Recommended to you

Latest news