కిచ్చా సుదీప్ ‘విక్రాంత్ రోణ’ ట్రైలర్ వచ్చేసింది..విజ్యువల్ వండర్‌గా ఫిల్మ్

శాండల్ వుడ్(కన్నడ) బాద్ షా..కిచ్చా సుదీప్ హీరోగా నటించిన అడ్వెంచరస్ త్రీ డీ ఫిల్మ్ ‘విక్రాంత్ రోణా’. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను RRR హీరో..మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ విడుదల చేశారు. అనుప్ భండారి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను జాక్ మంజునాథ్ , శాలిని మంజునాథ్ ప్రొడ్యూస్ చేశారు.

వచ్చే నెల 28న ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. ఈ ఫిల్మ్ లో స్టోరి, యాక్షన్ సీక్వెన్స్ , గ్రాఫిక్స్ వెరీ డిఫరెంట్ గా ఉండబోతున్నాయని ట్రైలర్ చూస్తుంటే స్పష్టమవుతోంది. వెరీ డిఫరెంట్ గెటప్ లో కిచ్చా సుదీప్ కనిపిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఇందులో కీలక పాత్ర పోషించారు.

పోలీస్ ఆఫీసర్, డెవిల్ రోల్ ను ‘విక్రాంత్ రోణ’గా కిచ్చా సుదీప్ ప్లే చేసినట్లు ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతోంది. ఈ మూవీకి బి.అజనీశ్ మ్యూజిక్ అందించగా, డీఓపీ విలయమ్ డేవిడ్. డెఫినెట్ గా ఈ సినిమా విజయం సాధిస్తుందని రామ్ చరణ్ ఆకాంక్షించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఆయన పోస్టు పెట్టారు.