వరంగల్‌లో ‘విరాట పర్వం’ ఆత్మీయ వేడుక..ఎప్పుడంటే?

టాలీవుడ్ మోస్ట్ అవెయిటెడ్ ఫిల్మ్ ‘విరాట పర్వం’ ఈ నెల 17న విడుదల కానుంది. ఈ క్రమంలోనే మేకర్స్ ప్రమోషన్స్ స్పీడ్ అప్ చేస్తున్నారు. తాజాగా డైరెక్టర్ వేణు ఊడుగుల కీలక అప్ డేట్ ఇచ్చారు. సినిమా కు సంబంధించిన ప్రీ రిలీజ్ కార్యక్రమం ఒకటి ఈ నెల 12న చేయబోతున్నట్లు తెలిపారు.

ఈ నెల 12న సాయంత్రం 5 గంటలకు ‘విరాట పర్వం’ మూవీ యూనిట్ సభ్యులతో ఆత్మీయ వేడుక ఉంటుందన్నారు. ఈ మేరకు ‘విరాట పర్వం’ సినిమా పోస్టర్ ట్విట్టర్ వేదికగా రిలీజ్ చేశారు. విరాట పర్వం జర్నీలో వరంగల్ కు ప్రత్యేక స్థానం ఉందని ఈ సందర్భంగా దర్శకుడు వేణు చెప్పారు.

ఇంత చక్కటి ఇన్ స్పైరింగ్ స్టోరి, పోయెట్రి, సాంగ్స్, వాయిస్ అంతా వరంగల్ నుంచే వచ్చిందని, వరంగల్ కు చెందిన సింగర్స్ ఈ సినిమాలో పాటలు పాడారని వివరించారు. దగ్గుబాటి రానా, సాయిపల్లవి జంటగా నటించిన ఈ పిక్చర్ ఎపిక్ లవ్ స్టోరి అని ఆల్రెడీ సినిమా చూసిన యంగ్ హీరో నిఖిల్ రివ్యూ ఇచ్చేశాడు. సురేశ్ బొబ్బిలి ఈ చిత్రానికి మ్యూజిక్ అందించారు.