బాలీవుడ్: ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు వివేక అగ్నిహోత్రి తాజాగా వైరల్ కామెంట్స్ చేశారు ఎక్కడ ఏ అన్యాయం జరిగినా వెంటనే స్పందించే ఈయన తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు తెలిపారు.సాధారణంగా బాలీవుడ్లో కాంట్రవర్సీలకు తెరతీసే ఇద్దరు వ్యక్తులు హీరోయిన్ కంగనా రనోత్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి వీరిద్దరూ పలు విషయాలపై సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ వస్తున్నారు ముఖ్యంగా కొన్నాళ్ల క్రితం నెపోటిజంపై బాలీవుడ్లో పెద్ద చర్చే జరిగింది ముఖ్యంగా బాలీవుడ్లో సినిమా మాఫియా కొనసాగుతుందంటూ వీరు చేసిన కామెంట్స్ వైరల్గా మారాయి.
ఈ నేపథ్యంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న వివేక్… “బాలీవుడ్ లో కొంతమంది నన్ను, కంగనాని టార్గెట్ చేశారు. బాలీవుడ్ లో జరిగే సమస్యలను, తప్పులని మేమిద్దరమే ప్రశ్నిస్తాం కాబట్టి మమ్మల్ని దూరం పెడుతున్నారు. తప్పు చేస్తే ప్రశ్నించే హక్కు మాకు ఉంది. అందుకే మా సినిమాలని, మమ్మల్ని టార్గెట్ చేసి, దూరం పెట్టి వేరు చేయాలనుకుంటున్నారు.. ఇప్పటికైతే బాలీవుడ్ నన్ను పూర్తిగా దూరం పెట్టినట్టే.. నాకు మధ్యతరగతి ప్రజల్లో, ఆడియన్స్ లో సపోర్ట్ వచ్చింది. కాని బాలీవుడ్ మాత్రం నన్ను దూరం పెట్టింది. ప్రస్తుతం ఉన్న బాలీవుడ్ సినిమాలు ముఖ్యంగా కరణ్ జోహార్ సినిమాలు వాస్తవానికి దూరంగా ఉంటాయి. వాళ్లు బయట దేశంలోని యూత్ మాత్రం బాలీవుడ్ సినిమాల్లో చూపించేంత వల్గర్ గా ఉండదు.. ” అంటూ చెప్పుకొచ్చారు
అంతేకాకుండా ఒకప్పుడు సినిమాల్లో కేవలం టాలెంట్ ఉన్నవారు మాత్రమే ఉండేవారు దాంతో సినిమాలు కంటెంట్ ఉండేవి కానీ ప్రస్తుతం కంటెంట్ తగ్గి కేవలం రెమ్యూనరేషన్, బడ్జెట్ పైనే ఆధారపడి ఉన్నాయి అందుకే ఆడియన్స్ సైతం వీటిని రిజెక్ట్ చేస్తున్నారు ఫెయిల్యూర్స్ ఎక్కువగా ఉండటానికి కారణం ఇదే అంటూ తెలిపారు.