తెలంగాణ, ఏపీకి మరో మూడు రోజులపాటు భారీ వర్షాలు

-

నిన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా ఉన్న అల్పపీడన ప్రాంతం ఇప్పుడు పశ్చిమ మధ్య & ఆనుకుని వాయువ్య బంగాళాఖాతం దగ్గరఉన్న ఉత్తర ఆంధ్ర ప్రదేశ్ మరియు ఒడిశా తీర ప్రాంతము వద్ద తీవ్ర అల్పపీడనంగా బలపడినది. దీని అనుభంద ఉపరితల ఆవర్తనం మధ్య ట్రోపోఆవరణం వరకు విస్తరించి ఉన్నది . ఈ తీవ్ర అల్పపీడన ము రానున్న 24 గంటల్లో దక్షిణ ఒడిషా- ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరానికి దగ్గర ఉన్న వాయువ్య & ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీద వాయుగుండముగా మరింత బలపడే అవకాశముంది.

సగటు సముద్ర మట్టం వద్ద ఉన్న ఋతుపవన ద్రోణి ఇప్పుడు ఓఖా, అకోలా, జగదల్పూర్ అక్కడ నుండి తూర్పు ఆగ్నేయ దిశగా మరియు దక్షిణ ఒడిషా- ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరానికి దగ్గర ఉన్న వాయువ్య దానిని ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతం పైగల తీవ్ర అల్పపీడన కేంద్రముగుండా వెళ్ళు చున్నది.

అల్పపీడన ద్రోణి ఇప్పుడు తూర్పుమధ్య అరేబియా సముద్రము మరియు కొంకణ్ తీర ప్రాంతము నుండి దక్షిణ ఒడిషా- ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరానికి దగ్గర ఉన్న వాయువ్య దానిని ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు మహారాష్ట్ర, తెలంగాణ, దక్షిణ ఛత్తీస్‌గఢ్ & కోస్తా ఆంధ్ర ప్రదేశ్ మీదుగా సగటు సముద్ర మట్టానికి 1.5 కి.మీ ఎత్తు వరకు విస్తరించి ఉంది. తూర్ప -పడమర గాలుల్లో కోత దక్షిణ భారత ద్వీపకల్పమైన 15°ఉత్తర అక్షాంశం వెంబడి సగటు సముద్ర మట్టానికి 3.1 కి.మీ నుండి 7.6 కి.మీ ఎత్తు వరకు కొనసాగుతున్నది. దీని ప్రభావంతో.. తెలంగాణలో మూడు రోజుల పాటు, ఏపీకి రెండు రోజుల పాటు వర్షాలు పడనున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news