వెంకటేష్ ఇంట్లో పెళ్లి వేడుకలు.. హాజరైన మహేష్ ఫ్యామిలీ..!

-

విక్టరీ వెంకటేశ్ ఇంట పెళ్లి వేడుకలు జోరందుకున్నాయి. వెంకీ చిన్న కూతురు హయవాహిని ఇవాళ (మార్చి 15న) మూడుముళ్ల బంధంలోకి అడుగుపెట్టనుంది. డాక్టర్ ఫ్యామిలీకి చెందిన అబ్బాయితో కూతురి పెళ్లి జరగనుంది. గతేడాది అక్టోబర్ లో ఎంతో సింపుల్ గా ఎంగేజ్మెంట్ కానిచ్చేశారు. నిశ్చితార్థపు వేడుకలాగే పెళ్లి కూడా సీక్రెట్ గానే పెద్దగా హంగూ ఆర్భాటాలు లేకుండా సింపుల్ గానే జరిపించనున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే హల్ది, మెహందీ వేడుకలు జరిగాయి. ఇందుకు సంబంధించిన ఫోటోలు ఏవీ లీక్ కాకుండా జాగ్రత్తపడ్డారు. అయితే తాజాగా మహేశ్బబు సతీమణి నమ్రత శిరోద్కర్ మెహందీ సెలబ్రేషన్స్ ఫోటోలను ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఫ్యామిలీ, ఫ్రెండ్స్ మంచి సమయం గడిపానంటూ పెళ్లికూతురు, పెళ్లికొడుకుతో ఫోటోలు దిగింది. ఈ వేడుకల్లో నమ్రత కూతురు సితార సైతం సందడి చేసింది. ఈ ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్గా మారాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version