టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో బాలకృష్ణ గురించి నట వారసత్వం గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తండ్రికి తగ్గ తనయుడిగా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకోవడమే కాకుండా రాజకీయాలలో కూడా చెరగని ముద్ర వేసుకున్నారు. ఇక ఇటీవల అఖండ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న బాలయ్య ప్రస్తుతం తన తదుపరి సినిమాలపై దృష్టి సారిస్తున్నారు. ఇకపోతే బాలయ్యను కలవాలి అన్నా.. సినిమాలు , డేట్స్, ప్రోగ్రామ్స్ కావాలి అంటే ఎవరిని అప్రోచ్ అవ్వాలి అనే ప్రశ్నకు డాక్టర్ సురేంద్ర అన్న పేరు గట్టిగా వినిపించేది. కానీ ఇప్పుడు మాత్రం మరొక పేరు వినిపిస్తోంది.అంతేకాదు ఎప్పుడైనా సిగరెట్ తాగే అలవాటు ఉన్న బాలకృష్ణ.. కూతురు వుంటే దానిని కూడా పక్కన పెడుతున్నట్లు సమాచారం. ఇకపోతే బాలకృష్ణ పెద్ద కూతురు హెరిటేజ్ వ్యవహారాలలో తప్ప మరెక్కడ కనిపించరు. కానీ చిన్న కుమార్తె బాలయ్యా వ్యవహారాలు చూసుకుంటున్నారు. ఇకపోతే ఎవరికి భయపడని బాలయ్య కూతురు దగ్గర తలవంచుతున్నారు అంటే ఆమెపై ఆయనకు ఎంత ప్రేమ ఉందో అర్థం చేసుకోవచ్చు అని అభిమానుల సైతం హర్షం వ్యక్తం చేస్తూ ఉండడం గమనార్హం.