ఎన్టీఆర్ జిల్లాలో టీడీపీ-వైసీపీ అభ్యర్ధులు ఫిక్స్..గెలిచేది ఎవరు?

-

నెక్స్ట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఇటు అధికార వైసీపీ, అటు ప్రతిపక్ష టీడీపీలు ముందుకెళుతున్న విషయం తెలిసిందే. ఎవరికి వారు సరికొత్త వ్యూహాలతో దూసుకెళుతున్నారు. అయితే ఎన్నికల సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో ఎక్కడకక్కడ రెండు పార్టీలు బలమైన అభ్యర్ధులని తయారు చేసుకుంటున్నాయి. గతానికి భిన్నంగా ముందుగానే అభ్యర్ధులని ఫిక్స్ చేసుకుని ముందుకెళ్లాలని చూస్తున్నాయి.

ఈ క్రమంలోనే ఎన్టీఆర్ జిల్లాలో రెండు పార్టీల అభ్యర్ధులు దాదాపు ఖరారు అయ్యారని చెప్పవచ్చు. అధికారికంగా ఇంకా ఎవరికి క్లారిటీ ఇవ్వలేదు గాని..అంతర్గతంగా నేతలకు పని చేసుకోవాలని చెప్పినట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ జిల్లాలో మొత్తం 7 సీట్లు ఉన్నాయి..విజయవాడ ఈస్ట్, సెంట్రల్, వెస్ట్, మైలవరం, నందిగామ, జగ్గయ్యపేట, తిరువూరు సీట్లు ఉన్నాయి. గత ఎన్నికల్లో ఒక్క విజయవాడ ఈస్ట్ తప్ప మిగిలిన సీట్లు వైసీపీ గెలుచుకుంది. ఇప్పుడు అన్నీ సీట్లలో వైసీపీకి టి‌డి‌పి గట్టి పోటీ ఇస్తుంది. ఇక నియోజకవర్గాల వారీగా అభ్యర్ధులని చూస్తే..విజయవాడ ఈస్ట్ లో టి‌డి‌పి నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మళ్ళీ పోటీ చేస్తారు..అటు వైసీపీ నుంచి దేవినేని అవినాష్ బరిలో దిగనున్నారు. ప్రస్తుతం ఇద్దరి మధ్య టఫ్ ఫైట్ ఉంది. ఒకవేళ టి‌డి‌పి-జనసేన కలిస్తే వైసీపీకి రిస్క్. సెంట్రల్ సీటులో టి‌డి‌పి నుంచి బోండా ఉమా దాదాపు ఖాయమే..వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఉన్నారు. ఇక్కడ టి‌డి‌పికి కాస్త లీడ్ ఉంది..జనసేన కలిస్తే అది మరింత పెరుగుతుంది.

వెస్ట్ లో సిట్టింగ్ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ మళ్ళీ వైసీపీ నుంచి పోటీ చేస్తారు..టి‌డి‌పి నుంచి క్లారిటీ లేదు. పొత్తు ఉంటే ఈ సీటు జనసేనకు దక్కవచ్చనే ప్రచారం ఉంది. మైలవరంలో వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్, టి‌డి‌పి నుంచి దేవినేని ఉమా తలపడతారు. ఇక్కడ టఫ్ ఫైట్ ఉంది. నందిగామలో వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే జగన్ మోహన్ రావు, టి‌డి‌పి నుంచి తంగిరాల సౌమ్య బరిలో ఉంటారు. ఇక్కడ కూడా టఫ్ ఫైట్ ఉంది.

జగ్గయ్యపేటలో వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను, టి‌డి‌పి నుంచి శ్రీరామ్ తాతయ్య పోటీ చేస్తారు. ఇక్కడ టి‌డి‌పికి ఎడ్జ్ ఉంది. తిరువూరులో వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే రక్షణనిధి పోటీ చేస్తారు. టి‌డి‌పిలో క్లారిటీ లేదు. ఇక్కడ వైసీపీకి ఎడ్జ్ ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news