టీకా వేసుకుంటానికి వ‌స్తే అందాలు చూపించ‌డం ఎందుకు ? మ‌లైకా అరోరాకు దారుణ విమ‌ర్శ‌లు..!

-

సినీ తార‌లు అంటే అంతే.. ఎప్పుడూ వార్త‌ల్లో నిల‌వాల‌ని, ప‌బ్లిసిటీ కోసం చూస్తుంటారు. అందుకు ఏం చేయడానికైనా వెనుకాడ‌రు. ఇక కొంద‌రు హీరోయిన్స్ బ‌య‌టి ప్ర‌పంచంలోనూ సినిమాల్లోలా కుర‌చ దుస్తుల‌ను ధ‌రించి తిరుగుతుంటారు. దీంతో ప్ర‌జ‌ల నుంచి విమ‌ర్శ‌ల‌ను ఎదుర్కొంటుంటారు. బాలీవుడ్ న‌టి మ‌లైకా అరోరా Malaika Arora కూడా స‌రిగ్గా ఇలాగే విమ‌ర్శ‌ల పాల‌వుతోంది. ఇంత‌కీ అస‌లు ఏం జ‌రిగిందంటే..

మ‌లైకా అరోరా / Malaika Arora
మ‌లైకా అరోరా /Malaika Arora

బాలీవుడ్ న‌టి మ‌లైకా అరోరా ఇటీవ‌లే కోవిడ్ రెండో డోసు టీకా తీసుకుంది. అందుకు గాను ఆమె టీకా కేంద్రానికి వెళ్లింది. అయితే సినిమా షూటింగో, ఐట‌మ్ సాంగ్‌కో వెళ్ల‌డం లేదు క‌దా, టీకాకేగా.. కానీ ఆమె అలా ఆలోచించ‌లేదు. రెగ్యుల‌ర్‌గా ధ‌రించే జిమ్ వేర్‌ను ధ‌రించి టీకాకు వెళ్లింది. అవే దుస్తుల‌తో టీకాను తీసుకుంది. అనంత‌రం తాను టీకాను తీసుకున్న‌ట్లు ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఫొటోను పోస్ట్ చేసింది. అయితే ఆమెను నెటిజ‌న్లు తీవ్రంగా విమ‌ర్శిస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Malaika Arora (@malaikaaroraofficial)

టీకా తీసుకుంటానికి అలాంటి దుస్తుల‌ను ధ‌రించి రావాల్సిన అవ‌స‌రం ఏముంది ? మ‌రీ టూమ‌చ్ చేస్తున్నావ్‌, టీకాను తీసుకుంటానికి వ‌స్తే అందాల‌ను చూపించ‌డం ఎందుకు ? అంటూ నెటిజ‌న్లు మ‌లైకాను తీవ్రంగా విమ‌ర్శిస్తున్నారు. ఆమెను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. అయితే ఆమెకు ఇలాంటి విమ‌ర్శ‌లు ఎదురు కావ‌డం కొత్తేమీ కాదు. త‌న‌క‌న్నా ఎంతో చిన్న వ‌య‌స్సు వాడైన అర్జున్ క‌పూర్‌తో ఆమె స‌హ‌జీవనం కొన‌సాగిస్తుండ‌డంపై గ‌తంలోనే నెటిజ‌న్లు దారుణంగా విమ‌ర్శించారు. ఇక ఆమె వేసుకునే దుస్తుల‌కు నెటిజ‌న్లు ఆమెను ఎప్పుడూ విమ‌ర్శిస్తుంటూనే ఉంటారు. అందుక‌నే ఇప్పుడు ఆమెను ట్రోల్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news