శకుంతలం దెబ్బతోనైనా ఆ విషయంలో ఆదిపురుష్ టీం జాగ్రత్త పడనుందా..!

-

టాలీవుడ్ హీరోయిన్ సమంత నటించిన చిత్రం శకుంతలం. ఈనెల 14వ తేదీన విడుదలైన ఈ సినిమా అనుకున్న స్థాయిలో విజయాన్ని సాధించలేకపోయింది. భారీ అంచనాల మధ్య గుణశేఖర్ తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలింది. అయితే ఈ విషయంతో తాజాగా చారిత్రక నేపథ్యంతో తెరకెక్కుతున్న ఆదిపురుష్ సినిమా జాగ్రత్త పడాల్సిందే అంటూ వార్తలు వినిపిస్తున్నాయి..

చారిత్రక నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమాలని చాలా జాగ్రత్తగా తెరకెక్కించకపోతే ఎన్నో విమర్శలు పాలు అవ్వాల్సి వస్తుందని నిరూపించిన చిత్రం శాకుంతల.. ముఖ్యంగా విజువల్ ఎఫెక్ట్స్​, గ్రాఫిక్స్​ ఉంటే చాలు ఆడియెన్స్​ థియేటర్లకు వచ్చేస్తారనుకుంటే పొరపాటే! ​ప్రస్తుతం సినిమాల విషయంలో ప్రేక్షకుల అభిరుచి పూర్తిగా మారిపోయిందనే విషయం శాకుంతలతో పూర్తిగా అర్థమవుతుంది. కథలో డ్రామా, పాత్రల మధ్య ఎమోషనల్​​ కనెక్షన్స్ ఉండాల్సిందే.. లేకపోతే ఫలితం ఊహించని రీతిలో ఉంటుందని అర్థమవుతుంది.

Prabhas says he was frightened while making Adipurush: ‘We made it with ...

కాగా ఈ సినిమాలో కథ, కథనం, ప్రధాన పాత్రల మధ్య కెమిస్ట్రీ, ఎమోషనల్​ కనెక్ట్​ లేకపోవడం, పాత్రలు సహజంగా అనిపించకపోవడం, పేలవ వీఎఫ్​ఎక్స్, గ్రాఫిక్స్​, సెట్టింగ్స్​​ ఇలా పలు అంశాలు సినిమాకు నెగటివ్​ టాక్ తెచ్చిపెట్టాయి. అయితే ఇదంతా ఇప్పుడు ప్రభాస్ ‘ఆదిపురుష్’​ టీమ్​ను, వారి అభిమానులను బాగా కంగారు పెడుతున్నట్లు తెలుస్తోంది.

శకుంతలలో ఎలాంటి తప్పిదాలు జరిగాయో అవే ఆది పురుషులో కూడా రిపీట్ కానున్న వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా విజువల్ ఎఫెక్ట్స్​, టీజర్​, పోస్టర్స్​ ఎవర్నీ ఆకట్టుకోలేకపోయాయి. సోషల్​మీడియాలో ఫుల్​ ట్రోల్స్​కు గురయ్యాయి. ఇక చేసేదేమి లేక సినిమాను వాయిదా వేసిన మూవీటీమ్​ విజువల్ ఎఫెక్ట్స్, ఇతర అంశాలపై మళ్లీ పూర్తి ఫోకస్​ పెట్టి వర్క్ చేస్తోంది.

అయితే ఈ వర్క్ పూర్తి చేయటం మొదలుపెట్టాక విడుదలైన పోస్టర్స్ మళ్లీ ఆడియెన్స్​ను నిరాశపెట్టాయి. గ్రాఫిక్స్ విషయంలో కొన్ని మార్పులు చేసినప్పటికీ పూర్తిగా మార్చటం సాధ్యమయ్యే పని కాదు.. మరి ఏం చేస్తారో కానీ.. ఔట్ పుట్​పై ప్రస్తుతం అందరికీ డౌటే ఉంది. ముఖ్యం ప్రభాస్ అభిమానులను తీవ్రంగా కలవరపెడుతోంది. అలానే ఆదిపురుష్ టీమ్​ కూడా బయటకు చెప్పుకోలేకపోయినా ఆ భయం వారిని కూడా వెంటాడుతుందనే అనిపిస్తోంది. ఏదేమైనా.. చారిత్రక కథలను స్క్రీన్​పై సరిగ్గా ప్రెజెంట్ చేస్తేనే అద్భుతాలు జరుగుతాయి. కొంచెం అటు ఇటు అయితే మాత్రం దారుణ ఫలితాలు వస్తాయి. చూడాలి మరి ‘ఆదిపురుష్’ సినిమా ఏం చేస్తుందో..

Read more RELATED
Recommended to you

Latest news