హ్యాపీ బర్త్ డే బాలయ్య : యువరాజ్ సింగ్ ట్వీట్

-

నటసింహం నందమూరి బాలకృష్ణ గురించి తెలియని వారుండరు. అయితే.. ఇవాళ నటసింహం నందమూరి బాలకృష్ణ బర్త్ డే. నటసింహం నందమూరి బాలకృష్ణ బర్త్ డే సందర్భంగా అన్ని రంగాల్లో ఉన్న ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా విషెస్ తెలియజేస్తున్నారు.

తాజాగా, క్రికెటర్ యువరాజ్ సింగ్ స్పెషల్ విషెస్ తెలియజేశారు. ‘హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు నందమూరి బాలకృష్ణ సార్. అనేక కార్యక్రమాలతో పాటు మీ క్యాన్సర్ హాస్పిటల్ & రీసెర్చ్ సెంటర్ ద్వారా సమాజంలో సానుకూల ప్రభావం చూపాలనే మీ అంకితభావం అందరికీ స్ఫూర్తిదాయకం’ అని ట్వీట్ చేశారు.

ఇక అటు చంద్రబాబు కూడా విశేష్ చెప్పారు. నటునిగా కళాసేవ… ఎమ్మెల్యేగా ప్రజా సేవ… ఆసుపత్రి నిర్వహణతో సమాజ సేవ చేస్తున్న మా బాలయ్యకు పుట్టిన రోజు శుభాకాంక్షలు. మంచి మనసుతో ఎందరో అభిమానులను సంపాదించుకున్న మీరు… నిండు నూరేళ్లూ ఆనందంతో, ఆరోగ్యంతో వర్థిల్లాలని కోరుకుంటున్నాను అంటూ పోస్ట్ పెట్టారు చంద్రబాబు.

 

Read more RELATED
Recommended to you

Latest news