స్టాప్ వాచింగ్ మూవీస్ పేరుతో ట్విట్ట‌ర్ లో వైర‌ల్‌.. బాలీవుడ్‌పై నెటిజ‌న్ల ఫైర్‌

-

సోష‌ల్ మీడియాలో ఎప్పుడూ ఏదో ఒక విష‌యం ట్రెండింగ్ లో ఉండ‌టం కామ‌నే. ఎందుకంటే ఏ విష‌యాన్ని అయినా సోష‌ల్ మీడియాలో వైర‌ల్ చేయ‌డం చాలా ఈజీ. ఇప్పుడు ఇదే కోవ‌లో ఓ విష‌యం విప‌రీతంగా వైర‌ల్ అవుతోంది. స్టాప్ వాచింగ్ మూవీస్ పేరుతో ట్విట్ట‌ర్ లో ఈ రోజు ఉద‌యం ఓ ఉద్య‌మం ఊపందుకుంది. దీంట్లో అనేక ర‌కాలైన విష‌యాల‌ను నెటిజ‌న్లు తెల‌పుతున్నారు.


ముఖ్యంగా బాలీవుడ్ సినిమాను చూడటం మానేయాల‌ని ఇందులో ట్వీట్ చేస్తున్నారు. బాలీవుడ్ లో అన్ని షేమ్‌లెస్ సినిమాలు అని, వ‌ల్గ‌ర్ గా ఉంటున్నాయ‌ని హిందూ ప్రేరేపిత గ్రూప్ ల ద్వారా ఈ విష‌యం ట్రెండింగ్ లోకి వ‌చ్చింది. ఈ హ్యాశ్ ట్యాగ్‌ను నెటిజ‌న్లు విప‌రీతంగా వైర‌ల్ చేస్తున్నారు. బాలీవుడ్‌ల్ అన్ని ముస్లిం సినిమాలే వేస్తున్నార‌ని, హిందూ దేవుళ్ల‌ను అవ‌మాన‌ప‌రుస్తున్నారంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. చూడ‌టం మానేయాల‌ని సంత్ రామ్ పాల్ జీ అనే ట్విట్ట‌ర్ ఐడీ ద్వారా మొద‌లైన ఈ ట్యాగ్‌లైన్ కొద్ది నిముషాల్లోనే ట్రెండింగ్ లోకి వ‌చ్చింది. టీనేజ్ పిల్ల‌లు ఈ సినిమాలు చూసి చెడిపోతున్నార‌ని పెద్ద‌లు మండిప‌డుతున్నారు.

ఇక జ‌స్టిస్ టు షుశాంత్ సింగ్ రాజ్‌పుత్ విష‌యం ట్రెండింగ్ లోకి వ‌చ్చిన రోజే ఈ విష‌యం కూడా వైర‌ల్ అవ‌డం విశేషం. కేవ‌లం బాలీవుడ్‌నే టార్గెట్ చేస్తూ ట్వీట్లు చేయ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఓ వైపు కొవిడ్ ఎఫెక్ట్ తో ఇప్ప‌టికే ఫిల్మ్ ఇండ‌స్ట్రీ కుదేల‌యింది. ఇక ఇలాంటి నిర‌స‌న‌ల‌తో సినీ ప‌రిశ్ర‌మ మ‌రింత న‌ష్ట‌పోయే ప్ర‌మాదం లేక‌పోలేదు. చూడాలి మ‌రి ఇది ఎటు దారి తీస్తుందో.

Read more RELATED
Recommended to you

Latest news