కార్తీకమాసంలో సూర్యోదయానికి ముందే స్నానం చేసి, దీపారాధన చేయాలి. కానీ ఇది అందరికీ సాధ్యం కాకపోవచ్చు. ఇటువంటివారికి శాస్త్రం చెప్పిన సులభోపాయం తెలుసుకుందాం…
త్రికార్తీక వ్రతం: కార్తీక పౌర్ణమికి ముందు అంటే కార్తీక శుద్ధ త్రయోదశి మొదలు పౌర్ణమి వరకు మూడురోజులు సూర్యోదయానికి ముందే స్నానం, దీపారాధన చేసి దేవతారాధన చేయడంతోపాటు పరనింద, అసత్యం మాట్లాడకుండా సత్ప్రవర్తనతో సాగడమే త్రికార్తీక వ్రతం.
ఈ మూడురోజులు కొన్ని నియమాలు పాటించాలి. అవి బ్రహ్యచర్యం, తలకు, శరీరానికి నూనెపెట్టడం, శనగపప్పు, మాంసాహారం, మధ్యాహ్న నిద్ర వంటివి మానేయాలి. నేలపై నిద్రించాలి. ఇలా చేస్తే కార్తీకమాసం మొత్తం స్నాన,దీపారాధనలు చేయలేనివారికి ఇదొక వరం.
శాస్త్రవచనం ప్రకారం త్రయోదశిరోజు వ్రతం పాటించేవారికి పవిత్రతను కలిగిస్తాయి. చతుర్దశి రోజు వ్రతంతో యజ్ఞాలు, దేవతల ద్వారా సాధకులు పవిత్రులవుతారు. పౌర్ణమి రోజు వ్రతం వల్ల శ్రీమహావిష్ణువు పవిత్రతని ప్రసాదిస్తాడు. కాబట్టి ఇక ఆలస్యం ఎందుకు బుధవారం త్రయోదశి నుంచి వ్రతం చేయండి. భగవదనుగ్రహం పొందండి.
– కేశవపంతుల వేంకటేశ్వరశర్మ