నేడు శైలపుత్రి అలంకారంలో శ్రీశైల భ్రమరాంబిక దర్శనం

-

అష్టాదశ శక్తిపీఠమైన శ్రీశైలంలో విజయదశమి ఉత్సవాలు అంగరంగవైభవంగా మొదలయ్యాయి. ఇవాళ్టి నుంచి అక్టోబర్ 5 వరరకు శ్రీశైల మహా క్షేత్రంలో దసరా ఉత్సవాలు ఘనంగా జరగనున్నాయి. ఇవాళ ఉదయం ఉత్సవాల ప్రారంభ పూజలు నిర్వహించారు ఆలయ అర్చకులు. ఈరోజు సాయంత్ర శ్రీశైల భ్రమరాంబిక అమ్మవారు శైలపుత్రి అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు.

దసరా ఉత్సవాల ప్రారంభ పూజతో దేవీ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఉత్సవాలకు ఆలయ నిర్వాహకులు ఘనంగా ఏర్పాట్లు చేశారు. ఆలయ ప్రాంగణాలను రంగురంగు విద్యుత్ దీపాలు , తోరణాలతో శోభాయమానంగా అలంకరించారు. ఆలయం ముందు భాగంలో ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాల తోరణాలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

నవరాత్రి ఉత్సవాల తొలి రోజు కావడంతో శ్రీశైలానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ నిర్వాహకులు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ప్రశాంతంగా శ్రీశైల భ్రమరాంబిక అమ్మవారి ఉత్సవాలు జరిగేలా పోలీసులు పటిష్ఠ బందోబస్తు నిర్వహించారు.

Read more RELATED
Recommended to you

Latest news