అదిరే LIC పాలిసీ… చివర్లో రూ.48 లక్షల కంటే ఎక్కువ రాబడి పొందొచ్చు..!

చాలా మంది వారికి నచ్చిన పథకాల్లో ఇన్వెస్ట్ చేస్తుంటారు. దీనితో మంచిగా డబ్బులను పొందుతూ వుంటారు. అయితే LIC తో కూడా మనం అదిరే లాభాలను పొందొచ్చు. అనేక రకాల పథకాలను LIC అందిస్తోంది. ఎలైసి అందించే వాటిలో LIC ప్లాన్ నంబర్ 914 కూడా ఒకటి.

ఇది కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే మరి దీని వలన కలిగే లాభాల గురించి కూడా చూద్దాం. చక్కగా తక్కువ పెట్టుబడి పెట్టి చివర్లో మంచిగా డబ్బులు పొందాలని చూసేవారు దీనిలో డబ్బులు పెట్టచ్చు. ఇక ఎవరు అర్హులు అన్నది చూస్తే.. ఈ పాలసీ లో ఇన్వెస్ట్ చెయ్యడానికి కనీస వయస్సు 8 సంవత్సరాలు. మాక్సిమం 55 సంవత్సరాలు ఉండాలి. కనీసం 12 సంవత్సరాల పాటు పెట్టుబడి ఈ ప్లాన్ లో పెట్టాలి.

కావాలంటే 35 సంవత్సరాలు చేయవచ్చు. దీనిలో లక్ష హామీ మొత్తాన్ని ఉంచాలి. 18 ఏళ్ల వయస్సులో మొదలుపెడితే రూ.10 లక్షల బీమా లభిస్తుంది. 35 సంవత్సరాల పదవీ కాలం ఉండాలి. సంవత్సరానికి రూ. 24391 ఖర్చవుతుంది. రూ. 2079 ప్రీమియంను ప్రతి నెలా కట్టాలి. 35 ఏళ్ల తర్వాత రూ.48 లక్షల 40 వేలు వస్తాయి.