చాలా మందికి పెళ్ళి కాలేదని ఫీల్ అవుతూ ఉంటారు..మంచి సంబంధాలు వచ్చినా కూడా ఏదొక వంకతో క్యాన్సిల్ ఆవుతున్నాయాని బాధాపడుతుంటారు.. అలాంటి వారు శ్రావణమాసం లో ఆ అమ్మవారికి భక్తితో పూజలు చేస్తే మంచి ఫలితాలు ఉంటాయని అంటున్నారు.. ఆ వ్రతం వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము..
శ్రావణమాసంలో ఆచరించాల్సిన వ్రతములలో మొదటిది మంగళగౌరీ వ్రతం. ఈ వ్రతం పెళ్లయిన, పెళ్లికాని ఆడపిల్లలకు శుభ్రప్రదంగా భావిస్తారు. ఈ శ్రావణమాసంలో వచ్చే నాలుగు మంగళవారాలు మంగళగౌరీని పూజించాలి..మంగళగౌరీ వ్రతం జూలై 19న వస్తుంది. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల మహిళలు సౌభాగ్యకరమైన ఐదవతనం కలకాలం నిలుస్తుందని ప్రతీతి. మంగళ యోగం వల్ల వివాహానికి ఆటంకాలు లేదా ఆలస్యమవుతున్న వారికి శ్రావణసమాసంలో వచ్చే మంగళగౌరీ వ్రతాన్ని తప్పక పాటించాలి. అంతేకాదు ఈ ఉపవాసం పాటించడం వల్ల వివాహానంతరం భార్యాభర్తల మధ్య సంబంధాల్లో ఏర్పడిన దూరాన్ని కూడా తొలగించవచ్చు.
తొలిసారిగా మంగళగౌరీ వ్రతం ప్రారంభించేటప్పుడు పెళ్లికానీ అమ్మాయిలు, వివాహిత స్త్రీలు మంగళవారం నాడు హనుమంతుని పాదాలకు నమస్కరించి తిలకాన్ని తీసి వారి నుదుటిపై పూస్తారు. వ్రతం చేస్తున్నవారు తల్లి పక్కనే ఉండి వ్రతాన్ని చేయించడం శ్రేష్టం. తొలి వాయనాన్ని కూడా తల్లికే ఇవ్వడం మంచిది. ఒకవేళ తల్లి లేకపోయినట్లయితే..అత్తగానీ లేదా ఇతర ముత్తైదువులు సహాయంతోగానీ వ్రతాన్ని పూర్తీ చెయ్యాలి..వ్రతాన్ని చేస్తున్న మహిళలు కాళ్ళకు పారాణి పెట్టుకోవడం మర్చిపోవద్దు..వ్రతం ఆచరించే సమయంలో పెళ్లికాని అమ్మాయిలు తప్పనిసరిగా శ్రీమద్ భగవత్ అని 18 సార్లు జపించాలి. గౌరీపూజన్, తులసీరామాయణంలోని సుందరకాండలోని 9వ శ్లోకాన్ని పఠించాలి ఇలా చేయడం వల్ల కుజుడు చల్లని దీవెనలు అందుతాయి.దాంతో ఉన్న దోషాలు పోయి పెళ్ళి యోగం కలుగుతుందని పండితులు చెబుతున్నారు..