గురువారం బాబాను ఇలా పూజిస్తే ఇంట్లో ఉండే కష్టాలు తొలగిపోతాయి..

-

గురువారం అంటే బాబాకు చాలా ఇష్టమైన రోజు..అందుకే ఈరోజు భక్తులు బాబాను భక్తి శ్రద్దలతో పూజిస్తారు.అయితే ఈరోజు ఎలా పూజిస్తె మంచి ఫలితం ఉంటుంది అనే విషయం గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం…

గురువారం సాయిబాబాను పూజించడం వల్ల భక్తులకు ఎంతో సంతోషం కలుగుతుంది..సాయిబాబా విశేష అనుగ్రహం పొందడానికి సాయిబాబాను ఎలా పూజించాలో తెలుసుకోండి..తెల్లవారుజామున నాడు లేచి స్నానం చేసి సాయిబాబా విగ్రహాన్ని పూజించాలి. ముందుగా బాబా చిత్రపటాన్ని లేదా విగ్రహాన్ని శుభ్రం చేయండి.

ఆ తరువాత, బాబా విగ్రహం క్రింద పసుపు వస్త్రాన్ని పరచి, ఆపై ఆయనకు పూల మాల సమర్పించండి. బాబాకు శెనగపిండి లడ్డూలు లేదా ఏదైనా స్వీట్లను ప్రసాదంగా సమర్పించండి. సాయి వ్రత కథను చదివి, బాబా విగ్రహం ముందు నెయ్యి దీపం వెలిగించి సాయిబాబాను ధ్యానించండి. ఇంట్లో అందరికీ బాబా ప్రసాదం పంచి స్వీకరించండి..
ఈరోజు ఉపవాసం ఉండే వాళ్ళు ఉదయం సాయంత్రం ఒక మంత్రాన్ని పఠించాలి.. అదే..

ఓం సాయి రామ్

ఓం సాయి గురువాయ నమః

ఓం సాయి దేవాయ నమః

ఓం షిర్డీ దేవాయ నమః
ఓం సమాధిదేవాయ నమః
ఓం సర్వదేవాయ రూపాయ నమః
ఓం మాలికాయ నమః

గురువారాల్లో సాయిబాబానే కాదు రాఘవేంద్ర స్వామిని కూడా పూజిస్తారు. మీరు గురువారం సాయిబాబాను పూజిస్తున్నట్లయితే, పైన పేర్కొన్న విధంగా ఆయనను పూజించవచ్చు , పై సాయిబాబా మంత్రాన్ని జపించవచ్చు..మంచి ప్రయోజనాలు ఉంటాయి..

Read more RELATED
Recommended to you

Latest news