Ganesh Chaturthi wishes and quotes : వినాయక చవితికి ఈ కోట్స్‌తో బంధు మిత్రులకు శుభాకాంక్షలు తెలపండి..!

-

Ganesh Chaturthi wishes and quotes : హిందువులు జరుపుకునే ప్రధాన పండుగలో వినాయక చవితి కూడా ఒకటి. ఎక్కువ మంది వినాయక చవితిని ఎంతో ఘనంగా నవరాత్రులు జరుపుకుంటారు. వినాయకుడికి పూజ చేసి వారి యొక్క కోరికల్ని భగవంతుడికి చెప్పి ఆరాధిస్తూ ఉంటారు. వినాయక చవితి నాడు మీరు మీ ఫ్రెండ్స్ కి విషెస్ చెప్పాలంటే ఈ విషెస్ ని మీరు వారితో పంచుకోవచ్చు. మీ స్నేహితులు లేదా బంధువులకు ఇలా ప్రత్యేకంగా వినాయక చవితి విషెస్ ని తెలపండి.

మీరు చేసే ఏ పని అయినా కూడా వినాయకుడు ఆశీస్సులతో.. విజయం చేకూరాలని.. వినాయక చవితి రోజున మీరందరూ ఆనందంగా గడపాలని కోరుకుంటూ.. వినాయక చవితి శుభాకాంక్షలు.

గణనాథుడు మిమ్మల్ని ఎప్పుడూ దీవించాలి. మీరు ఏ పని మొదలుపెట్టిన విఘ్నాలు లేకుండా పూర్తయ్యేటట్టు చూడాలని ఆ భగవంతుడిని మనస్పూర్తిగా కోరుకుంటూ.. మీకు మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు.

వినాయకుడి ఆశీస్సులు మీకు మీ కుటుంబానికి ఎల్లవేళలా ఉండాలని ఆశిస్తూ.. వినాయక చవితి శుభాకాంక్షలు.

క్షేమ, స్థైర్య, ఆయురారోగ్యాలు సిద్ధించాలని.. సుఖశాంతులు ఎప్పుడూ ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. వినాయక చవితి శుభాకాంక్షలు.

భక్తితో కొలిచాము గణపయ్యా దయతో మాపై కరుణ చూపయ్యా.. మీకు మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు.

ఆదిపూజ్యుడికి అభివందనం.. పార్వతీనందనుడికి ప్రియవందనం.. ముల్లోకాలను ఏలే మూషికా వాహనుడికి మనసే మందిరం.. మీకు మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు.

మట్టి గణపతిని పూజిద్దాం..పర్యావరణాన్ని పరిరక్షిద్దాం.. అందరకీ వినాయక చవితి శుభాకాంక్షలు..

సకల విఘ్నాలు తొలగించే ఆ వినాయకుడి ఆశీస్సులు మీపై ఉండాలని కోరుకుంటూ..
వినాయక చవితి శుభాకాంక్షలు

 

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version