నవరాత్రి స్పెషల్.. రూ.4కోట్లతో అమ్మవారికి ప్రత్యేక అలంకరణ

-

దేశవ్యాప్తంగా నవరాత్రి ఉత్సవాలు కన్నులపండువగా జరుగుతున్నాయి. అమ్మవారిని రోజుకో అలంకారంలో ముస్తాబు చేసి అంగరంగ వైభవంగా ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. కొన్నిప్రాంతాల్లో వినూత్న రీతిలో ఉత్సవాలు జరుపుతున్నారు.

నవరాత్రి ఉత్సవాలు ఆంధ్రప్రదేశ్ లో అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరిస్తూ భక్తిని చాటుకుంటున్నారు ప్రజలు. పశ్చిమ గోదావరి జిల్లా నిడమర్రు మండలం మందలపర్రులో ఉమా నీలకంఠేశ్వరస్వామి పంచతన క్షేత్రంలో రూ. 4కోట్ల విలువైన కరెన్సీ నోట్లతో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. ఈ అలంకరణకు రూ.2వేలు, రూ.500, రూ.200, రూ.100, రూ.50, రూ.20, రూ.10 నోట్లను ఉపయోగించారు. గత సంవత్సరం రూ.3.50 కోట్లతో అమ్మవారిని అలంకరించామని.. ఇప్పుడు రూ.4 కోట్లతో అలంకరణ చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.

వినూత్న రీతిలో కొలువుదీరిన అమ్మవారిని చూడటానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు తరలివస్తున్నారు. సర్వాంగ సుందరంగా ముస్తాబైన అమ్మవారి మండపాన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు. యువతీ యువకులు ఈ మండపంలో సెల్ఫీలు తీసుకుంటూ మురిసిపోతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news