రధ సప్తమి స్పెషల్: ఈ విధంగా ఆచరిస్తే ఏడు జన్మల పాపం తొలగిపోతుంది…!

-

పండుగలు భారతీయ జీవన విధానానికి ప్రతీకలు. ప్రతి పండుగ ఆధ్యాత్మిక, సాంస్కృతిక వాతావరణాన్ని పెంపొందించుతుంది. అలాంటి పండుగలలో రథసప్తమి కూడా ఒకటి. మాఘ శుద్ధ సప్తమి నాడు సూర్యుడు పుట్టిన రోజు. కనుక మాఘ మాసం లో వచ్చే శుద్ధ సప్తమిను రథ సప్తమిగా జరుపుకుంటారు. సూర్యుడు నిరంతరం రథం మీద తిరుగుతూ ఉంటాడు. సూర్యుని గమనం దక్షిణాయనం మరియు ఉత్తరాయణంగా జరుగుతుంది. సూర్యుని రథం దక్షిణాయనం లో దక్షిణ దిశగా పయనిస్తుంది.

ఆ తర్వాత సూర్యుడు మకర రాశి లోకి ప్రవేశిస్తాడు, దానితో ఉత్తరాయనం ప్రారంభం అవుతుంది. కానీ రథసప్తమి రోజు నుండి ఉత్తరాయణ మార్గం ను పూర్తిగా అనుభవించగలను మరియు ఆ రోజు నుండి వచ్చే కాంతులు పూర్తిగా ఉంటాయి. కనుక రథసప్తమి అని పేరు వచ్చింది. అందుకే ఈరోజు న పవిత్ర దినముగా భావించి భారతీయులు సూర్యుడు ని ఆరాధిస్తారు. రథ సప్తమిను సూర్య జయంతి అని కూడా పిలుస్తారు.

సూర్యుడుకు జిల్లేడు ఆకులు అంటే ఎంతో ప్రీతి. ఏడు జిల్లేడు ఆకులను ధరించి నదీ స్నానము చేస్తే ఏడు జన్మముల లో చేసిన పాపములు నశిస్తాయి. అంతే కాదు వ్యాధులను కూడా నశింపజేస్తాయి. ఇలా చేయడం వల్ల ఆరోగ్య ఐశ్వర్యాలు పొందుతారు. జిల్లేడు ఆకులతో పాటు రేగుపండును కూడా తల మీద పెట్టుకుని స్నానం చేయాలి. రేగుపండు తలపై పెట్టుకోవడం వల్ల శరీరంలో ఉండే కీడు పోతుంది. అనంతరం సూర్యుడిని ఆరాధించాలి. సూర్యుని స్తోత్రములు చదువుతూ పూజించాలి. ఈ విధంగా చేయడం వల్ల సూర్య భగవానుడు యొక్క ఆశీస్సులు పొందవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news