దేశ ప్రధాని నరేంద్ర మోదీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒకే గొడుగు కిందకి చేరారని టీపీసీసీ కార్య నిర్వాహకు అధ్యక్షుడు ఎంపీ రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఇరువురు కలిసి దేశ సంపదను కార్పొరేట్ సంస్థలకు అప్పజెప్పేందుకు ప్రణాళికలు రచిస్తున్నారని మండి పడ్డారు. వీరి ఆగడాలను అడ్డుకునేందుకే కాంగ్రెస్ పార్టీ జై జవాన్ జై కిసాన్ నినాదంతో ముందుకెళ్తుందని పేర్కొన్నారు. గాంధీ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరు సమావేశంతో రేవంత్ రెడ్డి మాట్లాడారు. నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా భారత్ బంద్‌లో పాల్గొన్న సీఎం కేసీఆర్ ప్రధాని మోదీని కలిసి ఆయనతో జోడికటి ఒక్కసారి కూడా చట్టాలను వ్యతిరేకించలేదని ఆరోపించారు.
ప్రభుత్వ జోక్యం వద్దు..
ఫార్మాసిటీ భూసేకరణలో ప్రభుత్వం జోక్యం చేసుకోకుండా రైతులు, పరిశ్రమల యజమానుల మధ్య ఒప్పందం కుదిరేలా చొరవ చూపాలని డిమాండ్ చేశారు. సాగు చట్టాల ద్వారా వచ్చే నష్టాలను రైతన్నలు, యువతకు తెలిపేందుకుకే పాదయాత్ర చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు. నూతన చట్టాలను వ్యతిరేకిస్తు తెలంగాణ సీఎం కేసీఆర్ అసెంబ్లీలో తిర్మాణం చేసి పంపాలని కోరారు.