ప‌రిహారాలు : ఇంట్లో మనశ్శాంతి కోసం పెద్దలు చెప్పిన తంత్రం

ప్రతీ ఒక్కరికి సాధారణంగా ఉండే కోరిక ప్రశాంతత కావాలి. అది ముఖ్యంగా ఇంట్లో. ఎందుకంటే అందిరికీ తెలుసు గృహమే సర్వసీమ కావాలనేది మన పురాతన కాలం నుంచి నేటి వరకు వస్తున్న ఆకాంక్ష. అయితే అనేక రకాల కారణాలతో ఇంట్లో అనేక బాధలు, ప్రశాంతత కరువు అవుతుంది. వీటన్నింటికి ఈతిబాధలు, గ్రహదోషాలు, నరఘోష, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు ఇలా అనేక రకాలు. వీటన్నింటి నుంచి విముక్తి పొంది ఇంట్లో ప్రశాంతంగా ఉండటానికి సులువైన తంత్రం ( ప‌రిహారాలు ) పెద్దలు చెప్పినది తెలుసుకుందాం…

 

ఇంట్లో ఆవుపేడతో చిన్న ప్రమిదను చేసి, అందులో నువ్వులనూనె, ఒక చిన్న బెల్లపుముక్క వేయాలి. ఈ ప్రమిదను ఇంటి ప్రధాన ద్వార గుమ్మం మధ్యలో ఉంచాలి. దీనివల్ల గృహంలో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. ఒక కొబ్బరికాయకు నల్లదారం చుట్టి, పూజా స్థలంలో ఉంచాలి. ఒక రోజంతా అలా ఉంచి, సాయంకాలం ఆ దారంతో సహా కాల్చేయాలి. తొమ్మిది రోజులు ఈ ఉపాయం చేయడం వల్ల ఆర్థిక పరమైన ఇబ్బందులు తొలగుతాయి. ఇంట్లో తులసిమొక్క ఉంటే సాయంకాలం దాని దగ్గర దీపం వెలిగించాలి. గృహానికి శుభకరం. ఇంటి ముఖ్య ద్వారం బయట వైపు శ్వేతార్క గణపతిని ఉంచితే శత్రు, రోగ, చోర భయాల నుండి రక్షణ లభిస్తుంది. ధన ధాన్య వృద్ధి కలుగుతుంది. ఈ తంత్రం ఒక శుభతిథి, వారం చూసుకుని చేయండి. దీనికి ప్రధానంగా నమ్మకం, విశ్వాసం, భక్తి, శ్రద్ధ చాలా అవసరం. వీటిని ఆచరించి శుభఫలితాలను పొందండి.