వైజాగ్ స్టీల్ ప్లాంట్.. టీడీపీ, వైసీపీ కలిసి పోరాడతాయా?

-

ఆంధ్రుల హక్కు.. విశాఖ ఉక్కు అన్న నినాదంతో వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటైంది. ప్రస్తుతం ఈ హక్కు ప్రైవేటు పరం కాబోతుందని రోజూ వార్తలు వస్తూనే ఉన్నాయి. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఐతే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటు పరం కాకుండా ఉండాలంటే అన్ని రాజకీయ పార్టీలు ఐక్య పోరాటం చేయాలని, దాన్ని సీఎం జగన్ ముందుండి నడిపించాలని టీడీపీ కోరుతుంది. ఈ విషయమై అటు వైసీపీ నాయకులు కూడా అదే మాట అంటున్నారు.

విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమంలో పార్టీలకతీతంగా పాల్గొనాలని మేమెప్పుడో పిలుపు ఇచ్చాం అని, టీడీపీ నేతలు సహకరిస్తే స్వాగతిస్తాం అని వైసీపీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ చెబుతున్నారు. అలాగే అటు టీడీపీ అధినేత చంద్రబాబు మాట్లాడుతూ, ఉక్కు ఉద్యమాన్ని జగన్ నేతృత్వంలో ముందుకు తీసుకెళ్ళాలని, అవసరమయితే ప్రజా ప్రతినిధులు రాజీనామాకు సిద్ధంగా ఉన్నారని, ప్లాంట్ పరిరక్షణకు ఎలాంటి త్యాగం చేయడానికైనా సిద్ధంగా ఉన్నామని తెలిపారు. మరి ఈ రెండు పార్టీలు ఒకే తాటి మీదకి చేరతాయా లేదా అన్నది చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news