మీ పిల్లలు చదువుల్లో రాణించాలంటే.. ఈ వాస్తు టిప్స్‌ పాటించండి..!

-

చిన్నపిల్లలు సహజంగానే చదువుల కన్నా ఆటల పట్ల ఎక్కువగా శ్రద్ధ చూపిస్తుంటారు. అయితే వారిలో కొందరు మాత్రమే చదువుల్లో రాణిస్తారు. కొందరు చదువుల్లో వెనుకబడుతుంటారు. కానీ నిజానికి ఇందుకు ఇంట్లో వాస్తు కూడా కారణం అవుతుంది. మీ పిల్లలు కూడా చదువుల్లో వెనుకబడుతుంటే అందుకు కొన్ని వాస్తు టిప్స్‌ను పాటించాల్సి ఉంటుంది.

follow these vastu tips for children education

1. పిల్లలు ఈశాన్యం లేదా ఉత్తరం లేదా తూర్పు వైపుకు ముఖం పెట్టి చదువుకోవాలి. ఆ దిక్కులను దైవ దిక్కులు అని పిలుస్తారు. అందువల్ల చిన్నారులకు సరస్వతీ దేవి ఆశీస్సులు లభిస్తాయి. దీంతో వారు చదువుల్లో రాణిస్తారు. ఏకాగ్రత పెరుగుతుంది. జ్ఞాపకశక్తి మెరుగు పడుతుంది.

2. కొత్తగా ఇల్లు కొనాలనుకుంటున్నా లేదా ఇంట్లోకి మారుదామని అనుకుంటున్నా అందులో చిన్నారుల రీడింగ్‌ రూమ్‌ ఈశాన్యం దిశ లేదా తూర్పు దిశలో ఉండేలా చూసుకోవాలి. దీంతో వారు చదువుల్లో రాణిస్తారు.

3. చిన్నారులు చదువుకునే టేబుల్‌పై పిరమిడ్‌, టవర్‌ లేదా ఎగిరే పక్షి లేదా గ్లోబ్‌ వంటి వస్తువులను ఉంచాలి. దీని వల్ల వారి ఊహాశక్తి పెరుగుతుంది. చదువుల్లో రాణిస్తారు.

4. చిన్నారులు చదువుకునే సమయంలో వారి వీపు తలుపుల వైపుకు ఉండరాదు. అలాగే వారి వెనుక పిల్లర్‌ వంటివి ఉండరాదు. ఉంటే వారి చదువులకు ఆటంకం ఏర్పడుతుంది.

5. చిన్నారుల స్టడీ రూమ్‌లలో గోడల రంగు లైట్‌ బ్లూ లేదా నారింజ లేదా ఎల్లో కలర్‌ లో ఉండాలి. అలాగే గోడలపై గొప్ప గొప్ప సైంటిస్టుల చిత్ర పటాలను ఉంచాలి. దీంతో వారిని చూసి చిన్నారులు ప్రేరణ పొందుతారు. వారు చదువుల్లో రాణిస్తారు. అలాగే చిన్నారులు పొందిన ట్రోఫీలను వారి గదిలో ర్యాక్‌లలో ఉంచాలి. ఇది కూడా వారిలో ప్రేరణను కలిగిస్తుంది.

6. చిన్నారుల పుస్తకాలను ఉంచే షెల్ఫ్‌లు ఓపెన్‌గా ఉంచరాదు. వాటికి కర్టెన్ల వంటి వాటిని ఏర్పాటు చేయాలి. అలాగే పుస్తకాలను ఎప్పుడూ తెరిచి ఉంచరాదు. దీని వల్ల నెగెటివ్‌ ఎనర్జీ వస్తుంది. పుస్తకాలను చిందర వందరగా కూడా పడేయరాదు. పద్ధతిగా అరల్లో సర్దుకోవాలి. ఇలా చేయడం వల్ల చిన్నారులు చదువుల్లో రాణిస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news