మీ కలలో ఇవి కనిపిస్తే.. కొంప కొల్లేరే.. ఆస్తులు గంగాపాలే అంటున్న నిపుణులు..!

-

మాములుగానే.. మనిషి ఎదిగే కొద్ది ప్రశాంతత నిద్ర దూరం అవుతుంది. మనకే తెలియని ఎన్నో టెన్షన్స్‌ వల్ల సరైన నిద్రపట్టదు. ఇంకా నిద్రపడితే.. ఆ నిద్రలో ఎవేవో కలలు. కలలు సహజం అయినప్పటకీ.. అవి రావడానికి ఒక కారణం ఉంటుంది. భవిష్యత్తుకు సంకేతాలుగా ఈ కలలను చెప్పుకోవచ్చని స్వప్న శాస్త్రం చెబుతోంది.ఈరోజు మనం కలలోకి వచ్చే కొన్నింటి గురించి చూద్దామా..!

చైనీస్ ఫ్యాన్..

చూడ్డానికి అచ్చం మన విసనకర్రలా ఉండే ఈ ఫ్యాన్ మీ కలలో వస్తే ఎవరితో అయినా వాదన అవుతుందట.. లేదా మీరు ఎవరితో అయిన గొడవ అవుతుందని భయపడుతున్నారని అర్థం.

చేతులు..

చేతులు కనిపిస్తే.. అంటే కేవలం చేతులు మాత్రమే కనిపిస్తే.. ఏదైనా సమస్య వస్తుందని అర్థమట.

మంచు..

కలలో మంచు కనిపిస్తే మీరు కొన్ని సమస్యలు ఎదుర్కోబోతున్నారని స్వప్న శాస్ర్తం చెబుతుంది.

తాళం చెవి..

ఇది ఓ రహస్యం అయినా మీకు తెలిసే అవకాశం లేదా.. ఏదైనా మీరు ఇబ్బంది పడుతున్న సమస్యకి పరిష్కారం అని సూచించే కలగా నిపుణులు చెబుతున్నారు.

ఎలుక..

అదే కలలో ఎలుక కనిపిస్తే మీరు ఏదో ఓ విషయంలో ఇరుక్కుంటారని అర్థమట. అది మీ పర్సనల్, అఫీషియల్, కుటుంబ ఇలా ఏదైనా వ్యవహారంలో మీరు అనవసరంగా ఇరుక్కుంటారని అర్థమట.

తాళం..

అదే మీకు తాళం కనిపిస్తే ఒత్తిడిలో ఉన్నట్లుగా అర్థమట. అందుకే ఆ కల వస్తుందని నిపుణులు చెబుతున్నారు.

సూర్యాస్తమయం..

కలలో సూర్యాస్తమయం వస్తుందంటే.. మీరు ఆస్తులను మీరు కాపాడుకునే సమయం వచ్చినట్లేనట. మీ ఆస్తులపై వేరే వారి కన్ను ఉందని అర్థం. కాబట్టి జాగ్రత్తగా ఉండండి..

జైలు..

మీకు కలలో జైలు కనిపించినా, లేదా జైల్లో మీరు ఉన్నట్లు కల వచ్చినా.. అది మీరు ఒత్తిడిగా ఉన్నట్లు, ఏదో సమస్యలో ఉన్నట్లుగా అర్థమట.

జూ..

మీ కలలో జూ గనుక వస్తే మీరు ఏదో కన్ఫ్యూజన్‌లో ఉన్నట్లు అర్థమట. అందుకే జూ మీకు కలలో కనిపిస్తుంటుందని చెబుతున్నారు.

సూది..

కలలో సూది కనిపిస్తే అది మీ ఇంట్లో కలహాలను సూచిస్తుందట. ఇంట్లో గొడవలు ఎక్కువగా జరుగుతుంటే కలలో సూదులు కలలో వస్తుంటాయట.

Read more RELATED
Recommended to you

Latest news