ఉల్లితొక్కలను పొడి చేసి ఇలా వాడితే అబ్బో ఎన్ని లాభాలో..!

-

వంటగదిలో వాడే చాలా పదార్థాలు మనకు తెలియకుండా ఎన్నో ప్రయోజనాలు కల్పిస్తాయి.. కానీ మనకే వాటి పూర్తి లాభాలు తెలియక కొంతవరకే ఉపయోగించుకుంటాం..తొక్క తీసి బంగాళదుంప కూర చేస్తారు.. అసలు ఆ తొక్కలోనే బోలెడు పోషాకాలు ఉంటాయని మనకు తెలియదు.. అలాగే ఉల్లిపాయలు కూడా అంతే..తొక్క తీసి కట్‌ చేసి..ఆ తొక్కలను పడేస్తారు.. కానీ ఆ తొక్కలను కూరల వాడుకోవచ్చన్న విషయం మనకు తెలియదు.. వాటిని పొడిగా చేసి చాలా రకాలుగా వాడుకోవచ్చట..ఎలానో చూద్దామా..!

అన్నం వండేటప్పుడు ఉల్లిపాయ తొక్కలను లేదా ఉల్లిపాయ పొడిని జోడించడం వల్ల అనేక ఆరోగ్య లాభాలు కలుగుతాయట.చపాతీల పిండి కలిపేటప్పుడు ఉల్లిపాయ పొడిని కాస్త కలిపితే కొత్త రుచి వస్తుంది. మంచి పోషకాలు కూడా అందుతాయి..

పులుసు, వేపుళ్ల కన్నా ఇగురును ఇష్టపడేవాళ్లే చాలామంది ఉంటారు.రొయ్యల ఇగురు, చేపల ఇగురు, బంగాళాదుంప ఇగురు లాంటివిన వండుతున్నప్పుడు గ్రేవీ చిక్కగా వచ్చేందుకు ఉలిపాయల పొడి కలపవచ్చు. ఇది కూరకు మంచి రంగును ఇస్తుంది. పొడి లేని వారు నేరుగా తొక్కలు వేసేయచ్చు. రెండు నిమిషాల ఉడికాక వాటిని తీసి బయటపడేయాలి.

ఉల్లిపాయ తొక్కల టీ..

ఉల్లిపాయ తొక్కలతో టీ కూడా చేసుకోవచ్చు. ఇది ఆరోగ్యానికి చాలా బాగా హెల్ప్‌ అవుతుంది. ఈ టీ తాగడం వల్ల మనసుకు ప్రశాంతంగా అనిపిస్తుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. కప్పులో వేడినీళ్లు పోసి ఉల్లిపాయ తొక్కలు లేదా ఉల్లిపాయ పొడి వేసి కలుపుకోవాలి. కాసేపు వేడి మీద ఉడికించాక తొక్కలను తీసి బయటపడేయాలి. పొడి కలిపితే వడకట్టుకుని టీని తాగేయడమే.

నీటిలో కలుపుకుని

ఉల్లిపాయ పొడిని నీటిలో కలుపుకుని కాసేపు నానబెట్టాక తాగొచ్చు.. ఇలా చేయడం వల్ల కండరాల తిమ్మిరి తగ్గుతుందని నిపుణులు అంటున్నారు. కండరాలు ఫ్లెక్సిబుల్‌గా మారతాయి. అదే ఉల్లిపాయ తొక్కలైతే గ్లాసు నీటిలో పావు గంటసేపు నానబెట్టి, తరువాత ఆ తొక్కలు తీసి తాగేయాలి. ఇది కషాయం లాంటిది.

ఉల్లిపాయలు తొక్కలతో పొడి చేసి ఓ డబ్బాలో దాచుకుని వంటల్లో ఉపయోగించుకోవచ్చు. ఆరోగ్యానికి కూడా ఇవి ఎంతో మేలు చేస్తాయి. ఉల్లిపాయ తొక్కలు ఎన్నో పోషకాలకు మూలం. ఇందులో విటమిన్ ఎ ఉంటుంది. విటమిన్ ఎ కంటి చూపును మెరుగుపరచడంతో పాటూ ఎన్నో రకాలుగా శరీరానికి శక్తిని అందిస్తుంది. అలాగే చర్మానికి ఎంతో అవసరమైన విటమిన్ సి, ఇ కూడా ఇందులో ఉన్నాయి. కాబట్టి.. వాటిని అస్సలు వేస్ట్‌ చేయొద్దు.

Read more RELATED
Recommended to you

Latest news