బుధవారం నాడు ఇలా చేస్తే బాధలు వుండవు…!

బుధవారం నాడు గణపతికి పూజ చేస్తే ఎంతో మంచి కలుగుతుంది. జ్ఞానాన్ని ఇచ్చే గణేశుడిని బుధవారం పూజించడం వలన విజ్ఞలన్నీ తొలగిపోతాయి అనుకున్నది సాధించొచ్చు కష్టాలు గట్టెకుతాయి. అయితే కేవలం పూజ చేయడం మాత్రమే కాకుండా ఈ విధంగా బుధవారం నాడు ఆచరిస్తే తప్పకుండా అనుకున్న పని పూర్తవుతుంది.

ఆర్ధిక ఇబ్బందులు ఉండకుండా ఉండాలంటే బుధవారం నాడు పచ్చని పెసలను దానం చేయండి. ఇలా చేయడం వలన ఎంతో మంచి కలుగుతుంది. పెసలని మరిగించి నెయ్యి పంచదార కలిపి ఆవుకి పెట్టడం వలన కూడా ఎంతో మేలు కలుగుతుంది. మీ కుటుంబ కష్టాలు గట్టెక్కాలంటే బుధవారం నాడు వినాయకుడికి 21 గరికపోచులను సమర్పించండి.

ఇలా గరికను సమర్పించడం వలన వినాయకుడు మీ కష్టాలు తొలగిపోతాయి. ఇంటర్వ్యూలో సక్సెస్ ని పొందాలంటే ప్రతి బుధవారం వినాయకుడిని పూజించండి. అదేవిధంగా ఆర్థిక సమస్యలు తొలగిపోవాలంటే బుధవారం నాడు ఏదైనా అవసరమున్న వాళ్ళకి పెసలని దానం చేయండి ఇలా ఈ విధంగా మీరు బుధవారం నాడు అనుసరించడం వలన ఇబ్బందులు ఏమీ లేకుండా ఆనందంగా ఆరోగ్యంగా జీవించడానికి అవుతుంది.