వాస్తు: దేవుడి గదిని సర్దేటప్పుడు ఈ తప్పులు చెయ్యద్దు..!

-

ఇంట్లో ఉండే పూజ గది అన్నిటి కంటే చాలా ముఖ్యమైనది. పూజ గదిలో ప్రశాంతత, పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. ముఖ్యంగా పూజగదిలో వాస్తు(vastu) పాటించడం మంచిది. దీని వల్ల మంచి పాజిటివిటీ ఇంట్లో కలుగుతుంది.

 

వాస్తు /vastu
వాస్తు /vastu

అదే విధంగా ఎలాంటి సమస్యలు లేకుండా దూరంగా ఉండొచ్చు. కాబట్టి పండితులు చెబుతున్న ఈ వాస్తు చిట్కాలను పాటించడం మంచిది. మరి ఇక ఆలస్యం ఎందుకు వాటి కోసం మనం ఇప్పుడే తెలుసుకుందాం.

వాస్తు శాస్త్రం ప్రకారం పూజ గది అన్నిటికంటే ముఖ్యమైనది. పూజ గదిని ఉత్తరం వైపు నిర్మించుకోవడం మంచిది అని పండితులు అంటున్నారు. అదేవిధంగా వాస్తు శాస్త్రం ప్రకారం మెట్లకింద ఎప్పుడూ కూడా పూజగది ఉంచుకోకూడదు. దీనివల్ల పాజిటివ్ ఎనర్జీ అస్సలు ఉండదు అని చెప్తున్నారు.

అలానే పూజగదిలో తెలుపు కానీ క్రీమ్ కలర్ కానీ వేసుకోవడం మంచిదని దీని వల్ల శుభఫలితాలు కనపడతాడు అని చెప్తున్నారు. అంతే కాదు ఎప్పుడూ కూడా పూజ గదిని శుభ్రంగా ఉంచుకోవాలని అని అంటున్నారు.

విష్ణుమూర్తి, శివుడు, వినాయకుడు, దుర్గా దేవి విగ్రహాలని తూర్పువైపున ఉంచటం మంచిదని దేవుడి ముఖం పడమర వైపు ఉండాలని అంటున్నారు. కనుక ఈ చిట్కాలను పాటించి ఆనందంగా ఉండండి లేదు అంటే సమస్యలు వస్తాయి. వీటిని తప్పకుండా పాటించడం వల్ల ఆరోగ్యంగా ఆనందంగా ఉండడానికి వీలవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news