హిందూమతంలో పితృపక్షాన్ని ఆచరించే సంప్రదాయం ఉందన్న విషయం మనకు తెలుసు. కుటుంబంలో మరణించిన సభ్యులకి పితృపక్షంలో వివిధ ఆచారాలను పాటించడం జరుగుతుంది. మరణం తర్వాత ఆయన కుటుంబాన్ని ఆశీర్వదించడమే దీని వెనుక ఉద్దేశం. చనిపోయిన వ్యక్తి ఆత్మ తృప్తి చెందితే కుటుంబంలో సుఖసంతోషాలు కలుగుతాయట. అదే ఒకవేళ వారు సంతోషంగా లేకపోతే ఇబ్బందులు కలుగుతాయట. పూర్వీకులు కోపంగా ఉంటే జీవితంలో అంతులేని కష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. చాలామందికి చనిపోయిన తమ పూర్వికులు ఆగ్రహాన్ని ఎలా గుర్తించాలో వారిని ఎలా సంతృప్తి పరచాలో తెలీదు. దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
పితృదేవతలు కలలో కనపడుతుంటారు. కొంతమందికి కలలో వారు ఏడుస్తూ కనపడితే అశుభంగా భావించాలి ఇలాంటి కలలు వస్తే పితృదేవతలు కోపంగా ఉన్నారని అర్థం చేసుకోవాలి. అలాగే పండుగ లేదా శుభకార్యాలలో ఆటంకాలు వస్తే ఆగ్రహంగా ఉన్నారని అర్థం చేసుకోవాలి. కుటుంబంలో ఎవరైనా చెప్పుకోలేని భయం లేదంటే ఎల్లప్పుడూ ఆందోళన చెందుతున్నా సంతృప్తిగా వారు లేరని అర్థం.
భోజనం చేసేటప్పుడు అప్పుడప్పుడు జుట్టుని చూస్తూ ఉంటాం. అయితే తరచుగా ఇది కనబడుతున్నట్లయితే పితృదేవతలు మీపై కోపంగా ఉన్నారని అర్థం చేసుకోవాలి. ఒక్కోసారి ఇల్లు ఎంత శుభ్రంగా ఉన్నా దుర్వాసన వస్తుంది. వాసన ఎక్కడి నుంచి వస్తుందనేది కూడా తెలియదు అలా జరుగుతున్నా కూడా పితృదేవతలు ఆగ్రహంగా ఉన్నారని అర్థం చేసుకోవాలి. కుటుంబంలో ఎవరికైనా వివాహం కాకపోవడం, సంతాన కలగకపోవడం కూడా పితృదేవతలు ఆగ్రహంగా ఉన్నారన్న దానికి సంకేతం