వాస్తు: సమస్యలు రాకుండా ఉండాలంటే ఈ తప్పులు చెయ్యద్దు…!

వాస్తు పండితులు వాస్తుకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలు మనతో షేర్ చేసుకున్నారు. వీటిని కనుక చూసారంటే ఎటువంటి సమస్యలు లేకుండా హాయిగా ఉండవచ్చు. మరి ఆలస్యం ఎందుకు వాటి కోసం ఇప్పుడే మనం చూసేద్దాం.

వాస్తు పండితులు ఈరోజు ఇంట్లో వాస్తు సమస్యలు తొలగించుకోవడానికి పరిష్కారం చెప్పారు. ఆగ్నేయం వైపు ఉండే గోడకి తెలుపు రంగు ఉంటే మంచిది కాదని చెబుతున్నారు. మీ ఇంట్లో కనుక అలా ఉంటే తప్పకుండా ఈ విషయాలు తెలుసుకోవాలి.

తెలుపు రంగు ఆగ్నేయం వైపు ఉండడం ప్రమాదకరమని అంటున్నారు. అందుకని ఎప్పుడూ కూడా ఇంట్లో ఉండే ఆగ్నేయం వైపు గోడల మీద తెలుపు లేదా సిల్వర్ కలర్ లేదా గ్రే కలర్ వేయించుకోవడం మంచిది కాదు.

దీని వల్ల ఇబ్బందులు వస్తాయని ప్రధమ కుమార్తెకి కూడా సమస్యలు కలుగుతాయని పండితులు చెప్పడం జరిగింది కాబట్టి ఎప్పుడూ కూడా ఆగ్నేయం వైపు ఉండే గోడకి తెలుపు రంగు వేయించుకోకండి. ఒక వేళ మీ ఇంట్లో కనుక ఆగ్నేయం వైపు గోడకు తెలుపు రంగు ఉంటే మార్చుకోవడం మంచిది లేదు అంటే సమస్యలు తప్పక వస్తాయి.