ప్రపంచంలో ఏకైక మానవనిర్మిత గుహాలో శివాలయం !

-

శివారాధన కేవలం మనదేశంలోనే కాదు ప్రపంచంలో పలు ప్రాంతాల్లో ఉంది. పూర్వకాలం నుంచి ఆయాచోట్ల ఆయా పేర్లతో శివున్ని ఆరాధించే సంస్కృతి ఉంది. ప్రపంచంలోని ప్రఖ్యాత శివాలయాల గురించి సంక్షిప్తంగా తెలుసుకునే క్రమంలో ఆస్ట్రేలియాలోని శివాలయం గురించి తెలుసుకుందాం…
ముక్తి గుప్తేశ్వర దేవాలయం, ఆస్ట్రేలియా ప్రదేశం- మింటో, న్యూసౌత్‌వేల్, ఆస్ట్రేలియా ప్రధాన దేవుడు- ముక్తి గుప్తేశ్వర (మహాశివుడు) నిర్మించినది – ఆస్ట్రేలియాలోని హిందుమతస్తులు విశిష్టత – ప్రపంచంలోనే ఒకే ఒక్క మానవనిర్మిత గుహాలయం ప్రవేశం -ఉచితం (ఉదయం 10నుంచి 12 గంటల వరకు, సాయంత్రం 5 నుంచి 7 వరకు దర్శనం చేసుకోవచ్చు.

వారాంతాల్లో ఉదయం 10 నుంచి రాత్రి 7 వరకు దర్శించుకోవచ్చు) దర్శించడానికి అనువైన కాలం- ఫిబ్రవరి, మార్చి దేవాలయాన్ని నిర్మించింది – 1997 ప్రారంభించి 1999లో పూర్తిచేశారు. శివలింగాన్ని బహుకరించింది – నేపాల్ రాజు మహారాజ బీరేంద్ర బిర్ విక్రమ్ సహదేవ్. గుప్తేశ్వర దేవాలయంలో ఏం ఉన్నాయి – పన్నెండు ద్వాదశ జ్యోతిర్లింగాలతోపాటు పదమూడవదిగా గుప్తేశ్వరస్వామి, 108 హనుమంతుడు ప్రతిష్టించిన పేర్లతో 108 శివలింగాలను, శివసహస్రనామాలతో 1008 శివలింగాలను ఏర్పాటు చేశారు. అంటే మొత్తం 1228 శివలింగాలను ఇక్కడ ప్రతిష్టించారు.

గుహ ప్రత్యేకత: మానవ నిర్మిత గుహ. ఇది సుమారు 10 మీటర్ల లోతు ఉంటుంది. సుమారు రెండు మిలియన్ల భక్తులు/దేవాలయ సందర్శకులు గుహలోపల రాసిన ఓం నమఃశివాయ నామం కనపడుతుంది. దేవాలయంలో ప్రపంచంలోని 81 నదుల్లో నుంచి తెచ్చిన జలాలు, ఐదు మహాసముద్రాల నుంచి తెచ్చిన జలాలు ఉంచారు. అంతేకాకుండా ఎనిమిది ప్రధాన లోహలు, ప్రసిద్ధిగాంచిన స్వామిజీలు, గురువుల సందేశాలను ఇక్కడ భద్రపర్చారు. గుడిలో మాతా మందిర్, రామ్‌పార్వతీ మందిర్, గణపతి మందిర్‌లకు కూడా ఉన్నాయి.  ఆస్ట్రేలియా వెళ్లినప్పుడు తప్పక ఈ గుహాలయాన్ని సందర్శించండి.

– కేశవ

Read more RELATED
Recommended to you

Latest news