గురువారం సాయిబాబాకు పాలాభిషేకం చేస్తే ఆ దోషాలు పోతాయట..

-

గురువారం అంటే సాయినాధుడు కు చాలా ఇష్టమైన రోజు..ఈరోజు ఆయనను భక్తితో కోరుకుంటే ఎటువంటి కోరికలు అయిన కూడా ఇట్టే నెరవేరుతాయని భక్తుల నమ్మకం.ధూప దీపాలతో పాలకోవాతో నైవేద్యంతో సాయిని పూజిస్తారు.అయితే గురువారం నాడు బాబా విషయంలో పాటించవలసిన నియమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

గురువారం రోజున సాయిబాబాను ప్రత్యేకించి ప్రార్థించడంతో పాటు, పూజ అనంతరం ఇంటికి చిన్నపిల్లలను పిలిచి ప్రసాదాన్ని అందించడం ద్వారా, ఆ చిన్న పిల్లలతో కొంత సేపు ఆనందమైన సమయాన్ని గడపడం ద్వారా బాబా కృపకు చేరువవచ్చని పెద్దలు చెబుతున్నారు. ఎందుకంటే బాబాకు చిన్నారులు అంటే చాలా ఇష్టమట..వారితో ఎక్కువ గడిపెవారని పురాణాలు చెబుతున్నాయి.

కల్మషం లేకుండా స్వచ్చమైన నవ్వులు చిందించే పిల్లలు ఈ ప్రపంచానికి స్ఫూర్తి దాయకమని, అటువంటి చిన్నారులకు బాబా ప్రసాదాన్ని అందించడం ద్వారా మంచి ఫలితం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. ఈ ప్రత్యేకమైన రోజున బాబా పేరిట పేరిట అన్నదానం చేస్తే పుణ్య ఫలం దక్కుతుంది.

గురువారం నాడు సాయినాథుడి విగ్రహానికి పాలాభిషేకం చేస్తే చాలా మంచిది. అదే విధంగా బాబాకు ఇష్టమైన నైవేద్యం పాలకోవా అందించడం మరింత మంచిది. అదే విధంగా గురువారం నాడు పూజ గదిని ప్రత్యేకించి అలంకరించడం, ధూప దీపాలతో బాబాను పూజించడం మంచిది. బాబాకు జీవ హింస అస్సలు నచ్చదు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి..ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని ఆయనను స్మరించుకుంటే మనకు ఉన్న దోషాలు పోతాయి..

Read more RELATED
Recommended to you

Latest news