తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులకు ముఖ్య మంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు శుభవార్త చెప్పారు. కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రతి నియోజకవర్గంలో విద్యార్థులకు నాణ్యమైన ఉచిత కోచింగ్ ఇవ్వనున్నట్లు విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. 80 వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిర్ణయించడం జరిగింది.వీటికోసం ప్రయివేటు కోచింగ్ సెంటర్ లలో నిరుద్యోగ యువత వేలకు వేలు ఖర్చు చేయకుండా ఎక్కడికక్కడ కోచింగ్ సెంటర్ లు ఏర్పాటు చేయాలని ప్రజాప్రతినిధులకు ముఖ్యమంత్రి గారు ఆదేశించారన్నారు.
మహేశ్వరం నియోజకవర్గములో ఇప్పటికే తుక్కుగూడ లో ఉచిత శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఇందులో 500 మంది వరకు శిక్షణ పొందుతుందన్నారని అన్నారు.జులై 11 నుండి బడంగ్పేట్ లో శిక్షణా ప్రారంభిస్తున్నట్లు,మునిసిపల్ కార్యాలయంలో పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. అనంతరం మెటీరియల్ కూడా ఉచితంగా అందజేస్తామన్నారు.జిల్లా గ్రంథాలయంలో ఈ శిక్షణా శిబిరం నిర్వహిస్తున్నట్లు మంత్రి తెలిపారు.అన్ని రకాల పోటీ పరీక్షల పుస్తకాలు,మెటీరియల్ అందుబాటులో ఉంచినట్లు మంత్రి తెలిపారు సబితా ఇంద్రారెడ్డి.