మనీ ప్లాంట్ ఉంటే వీటిని తప్పక పాటించాలి..

-

ఈరోజుల్లో పల్లెలు, పట్టణాలు అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ చెట్లను పెంచుతున్నారు.. కొంత మంది ఇంటి అలంకరణ కోసం పెంచితే, మరి కొంతమంది మంది మాత్రం ఆరోగ్యం కూడా మొక్కలను పెంచుతున్నారు. అయితే కొందరూ మనీ ప్లాంట్ ను కూడా పెంచుతారు. ఇంట్లో ధన ప్రవాహం పెరుగుతుందని ఆశిస్తూ మనీ ప్లాంట్ పెంచుకుంటారు.చాలా కొద్ది మందికి మాత్రమే తెలిసిన విషయం ఏమిటంటే దానిని పెంచే పద్ధతి. పెంచడం వేరు, పద్ధతిగా పెంచడం వేరు. ఈ రెండింటికి చాలా తేడా ఉంటుంది. ముఖ్యంగా మనీ ప్లాంట్ విషయంలో కొన్ని నియమాలు పాటించాల్సి ఉంటుంది. అవి కచ్చితంగా పాటిస్తేనే మనీ ప్లాంట్ వల్ల ఉపయోగం ఉంటుంది.

మనీ ప్లాంట్ కు సంబంధించి వాస్తు శాస్త్రంలో ప్రత్యేక సూచనలు ఉన్నాయి. వీటికి అనుగుణంగా మనీ ప్లాంట్ ను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ చిట్కాలు పాటిస్తే మంచి ప్రయోజనం ఉంటుంది. మనీ ప్లాంట్ ను ఎవరికైనా బహుమతిగా అసలే ఇవ్వకూడదు. ఈ మొక్క శుక్ర గ్రహానికి చెందినది. కాబట్టి మనీ ప్లాంట్ ను గిఫ్ట్ గా ఇస్తే.. ఇచ్చిన వారిని, తీసుకున్న వారిని శుక్రుడు బాధించవచ్చు..ఎవరికీ ఈ మొక్కను గిఫ్ట్ గా ఇవ్వడం చెయ్య కూడదని అంటున్నారు.శుక్ర గ్రహం అనుగ్రహం ఉంటే ఇంట్లో సంతోషం వెల్లివిరుస్తుంది. అదే ఆగ్రహం ఉంటే ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.

మనీ ప్లాంట్ మొక్క పెరుగుతున్న కొద్దీ అందంగా కనిపిస్తుంది. అందుకే కొందరు ఇంటి బయట అలంకరణగా దీనిని పెంచుతారు. ఇలా అసలే చేయవద్దు. మనీ ప్లాంట్ ను ఇంట్లోనే పెంచుకోవాలి. బయట పెంచుకుంటే దీని వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. చిన్నగా ఉన్నా ఇంట్లో పెంచుకుంటేనే దాని ప్రయోజనం ఉంటుంది. ఇంట్లో దాని ప్రభావం పడుతుంది. మరోక్క ముఖ్యమైన విషయం. మనీ ప్లాంట్ ను నేలపై పెంచకూడదు. భూమికి ఎత్తుగా ఉన్న ప్రాంతాల్లో మనీ ప్లాంట్ పెంచాలి. కుండీని వేలాడదీసి ఈ మొక్కను పెంచవచ్చు. కొందరు వాటర్ బాటిల్ ను వేలాడదీసి మనీ ప్లాంట్ పెంచుతుంటారు..కిటికీలకు కూడా ఈ మొక్కను పెంచవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news