
నవగ్రహాలలో శని గ్రహం అంటే అందరికీ భయం. ఏ పని కాకున్నా శని బాగులేదు అన్నమాటే అందరినోటా. నిజానికి శని చాలా మంచివాడు. నిజాయతితో ఉన్నవారికి తప్పక మంచిచేసే స్వభావం శనిదని శాస్ర్తాలు చెపుతున్నాయి. శనిదోషాలు పోవడానికి చాలా పరిష్కారాలు ఉన్నాయి. వాటిలో అతి ముఖ్యమైనది శనివారం నవగ్రహాలలోని శని పూజ. అందులోనూ త్రయోదశితో కూడుకున్నదైతే మరీ మంచిది. 19వ తేదీన శనివారం త్రయోదశితో కూడుకుని ఉన్నది. కాబట్టి ఈ రోజు కింది రాశుల వారు పూజ చేయించుకుంటే చాలా మంచిది.
ఏలినాటి శని నడుస్తున్న రాశులు- మకరం, వృశ్చికం, ధనస్సు
అష్టమ శని ఉన్న- వృషభరాశి
అర్ధాష్టమ శని ఉన్న – కన్యారాశి
పై రాశుల వారు 19వ తేదీని శనికి పూజచేయించుకుంటే శనిదోషం కాస్తా శాంతించి గొడ్డలితో పోయేది గోటితో పోతుంది.
– కేశవ