ఆ దేవాలయంలో చెప్పుల్ని కడతారట.. కారణం ఇదే..!

-

ఒక్కొక్క ఆలయంలో ఒక్కొక్క సాంప్రదాయాన్ని పాటిస్తూ ఉంటారు. పూర్వం నుండి ఎటువంటి పద్ధతులను అయితే పాటిస్తూ వచ్చారో ఇప్పుడు కూడా అటువంటి పద్ధతుల్ని చాలా మంది చాలా చోట్ల అనుసరిస్తూనే ఉన్నారు.

కొన్ని కొన్ని చోట్ల ఉండే సాంప్రదాయాన్ని చూస్తే షాక్ అవుతూ ఉంటాము. ఈ సాంప్రదాయం కూడా చాలా విడ్డూరంగా ఉంది. ఇక్కడ ఆలయంలో ఒక వింతైన సాంప్రదాయం ఉంది. దీన్ని చూశారంటే మీరు కూడా ఆశ్చర్యపోతారు. మరి ఇక ఇక్కడ ఉన్న సాంప్రదాయం ఏమిటి…? ఇక్కడ ఎలా భక్తులు అనుసరిస్తారు అనేది తెలుసుకుందాం.

కర్ణాటకలోని ఒక ఆలయంలో చాలా వింతైన సాంప్రదాయం ఉంది. మామూలుగా ఆలయానికి వెళితే మనం చెప్పుల్ని బయట వదిలి లోపలికి వెళ్తాం. కర్ణాటక రాష్ట్రంలోని కల్లబూర్గి జిల్లాలోని అలంద్ సమీపంలో గోలబి గ్రామంలో లక్కమ్మ వారి ఆలయం వుంది.

దీపావళి పండుగ కి ఐదు రోజుల తరవాత అనగా పంచమి నాడు మరియు కార్తీక పౌర్ణమి రోజు అక్కడ జాతర జరుగుతుంది. అప్పుడు జాతరలో భక్తులు కొత్త చెప్పుల్ని కొని వాటిని కట్టి వారి కోరికల్ని అమ్మవారికి చెబుతారు. ఇలా వారి కోరికలను నెరవేర్చుకోవడానికి పాదరక్షకులను అక్కడ కడతారు. ఇదివరకు ఇక్కడ ఎద్దుల్ని కూడా బలి ఇచ్చేవారు కానీ ఇది చట్ట విరుద్ధం అని మానేశారు. ఏదిఏమైనా ఇక్కడ చెప్పులు కట్టడం చాలా వింతగా ఉంది కదా..?

Read more RELATED
Recommended to you

Latest news