ఈరోజు సాయిబాబాకు ఇలా పూజలు చేస్తే కోరిన కోరికలు వెంటనే తీరుతాయి..

-

సాయిబాబా అంటే గురువారం అని అందరూ అంటారు.ఈరోజు అన్నా బాబాకు చాలా ఇష్టం..అందుకే బాబాకు భక్తులు ప్రతి గురువారం ప్రత్యెకమైన పూజలను చేస్తారు.ధూప దీపాలతో పాలకోవాతో నైవేద్యంతో సాయిని పూజిస్తారు.అయితే గురువారంనాడు చేస్తున్న పూజలలో కొన్ని నియమాలను తప్పక పాటించాలి.అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

గురువారం రోజున సాయిబాబాను ప్రత్యేకించి ప్రార్థించడంతో పాటు, పూజ అనంతరం ఇంటికి చిన్నపిల్లలను పిలిచి ప్రసాదాన్ని అందించడం ద్వారా, ఆ చిన్న పిల్లలతో కొంత సేపు ఆనందమైన సమయాన్ని గడపడం ద్వారా బాబా కృపకు చేరువవచ్చని పెద్దలు చెబుతున్నారు. ఎందుకంటే బాబాకు చిన్నారులు అంటే చాలా ఇష్టమట.

పిల్లలు ఎటువంటి కల్మషం, కుట్రలు లేని వాళ్ళు, మనసులో ఏవి పెట్టుకోకుండా స్వచ్చమైన నవ్వులు చిందించే పిల్లలు ఈ ప్రపంచానికి స్ఫూర్తి దాయకమని, అటువంటి చిన్నారులకు బాబా ప్రసాదాన్ని అందించడం ద్వారా మంచి ఫలితం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. ఈ ప్రత్యేకమైన రోజున బాబా పేరిట పేరిట అన్నదానం చేస్తే పుణ్య ఫలం దక్కుతుంది.

ఇకపోతే ఈరోజు బాబాకు పాలాభిషేకం చేస్తే చాలా మంచిది. అదే విధంగా బాబాకు ఇష్టమైన నైవేద్యం పాలకోవా అందించడం మరింత మంచిది. అదే విధంగా గురువారం నాడు పూజ గదిని ప్రత్యేకించి అలంకరించడం, ధూప దీపాలతో బాబాను పూజించడం మంచిది. బాబాకు జీవ హింస అస్సలు నచ్చదు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఇలా బాబాకు ఇష్టమైన రోజున పై నియమాలను పాటించడం ద్వారా సాయి బాబా కృప  మనమీద ఉంటుంది. అలాగే కోరిన కోరికలు కూడా తీరుతాయి..

Read more RELATED
Recommended to you

Latest news